అన్వేషించండి

National Herald: నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీ ముందు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి

యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కొక్కరూ ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. నేడు మాజీ మంత్రి గీతారెడ్డి వంతు వచ్చింది. ఆమె నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అప్పట్లో యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతా రెడ్డితోపాటు గాలి అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారణ చేసింది.

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారిలో తెలంగాన నేతలు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

సెప్టెంబర్‌ 23న నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు గీతా రెడ్డి, సుదర్శన్‌ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి కూడా నోటీసులు జారీచేసింది. వీరిని ఒక్కొక్కరుగా ఈడీ విచారణ చేస్తోంది. అక్టోబర్‌ 4న (మంగళవారం) కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ఎదుటకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు. ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ విచారణ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. మొదట్లో రాహుల్‌ గాంధీని సుదీర్ఘంగా విచారణ చేసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధానాలు రావడంతో మూడో రౌండ్ విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు 6 గంటల పాటు సోనియాను ప్రశ్నించింది.

జూన్‌ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ గాంధీని ఈడీ 30 గంటలకు పైగా విచారణ చేసింది. వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. జూన్‌ 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈడీ ఒకరోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో రాహుల్ విచారణ వాయిదా వేసింది. 

ఈ కేసులో సోనియాను కూడా జూన్ 23న ఈడీ విచారణకు పిలిచింది. యంగ్‌ ఇండియన్, ఏజేఎల్, నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాల్లో రాహుల్‌ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. సోనియా గాంధీని మూడు రోజులపాటు రోజుకు మూడు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget