అన్వేషించండి

ED Raids: కవిత, భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు - కస్టడీ చివరి రోజే రైడ్స్‌

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది.

ED Raids At MLC Kavitha Relatives Houses: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో ఇవాళ  (శనివారం) ఉదయం నుంచి రైడ్స్‌ జరుగుతున్నాయి. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు, భర్త అనిల్‌ సోదరి అఖిల ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి రైడ్స్‌ కొనసాగుతున్నాయి. దీంతో... సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.

బంధువుల ఇళ్లల్లో సోదాలు 

మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీసింది. మళ్లీ... ఇప్పుడు కవిత కస్టడీ చివరి రోజున ఈడీ... మరోసారి దాడులు  నిర్వహిస్తోంది. కవిత, ఆమె భర్త బంధువుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త అనిల్‌తో పాటు పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ల  ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కవిత పీఏలకు నోటీసులు ఇచ్చి... ఈడీ ఆఫీసుకు పిలిపించుకుని ప్రశ్నించారు. 

నేటితో ముగియనున్న కస్టడీ

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మార్చి 16న కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ ఎవెన్యూ కోర్టు. ఏడు రోజుల పాటు ఆమెను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈనెల 23న అంటే... ఇవాళ మధ్యాహ్నాం 12గంటలకు కవితను తిరిగి  కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం కవితను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనుంది ఈడీ. అంతేకాదు... కవిత కస్టడీని మరికొన్ని  రోజులు పొడిగించాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. ఈడీ కస్టడీ లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరనుంది. అయితే... కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఉత్కంఠగా మారింది.

ఆరు రోజులుగా విచారణ 

గత ఆరు రోజులుగా కవితను ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం (ప్రవర్తన భవన్‌)లో ఉంచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ పలు విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారమే... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌  చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక... ఈడీ కస్టడీలో ఉన్న కవితను... ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్‌, లాయర్‌తోపాటు పలుమార్లు కలిశారు. కోర్టు అనుమతితో... గత రెండు రోజులుగా కుటుంబసభ్యులు కూడా ఆమెను కలిశారు.  కూతురు, కుమారుడు, తల్లి శోభాతోపాటు పలువురు కుటుంబసభ్యులు కవితను కలిసి వచ్చారు. 

ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్టు 

ఇక... ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ). నిన్న కేజ్రీవాల్‌ను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు కేజ్రీవాల్‌ను మార్చి 28వరకు అంటే ఆరు రోజుల పాటు ఈడీ  కస్టడీకి అప్పగించింది. అంటే... ఇవాళ్టి (మార్చి 23) నుంచి కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్న ఈడీ. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత కస్టడీ కూడా ముగుస్తోంది. ఈ క్రమంలో... కేజ్రీవాల, కవితను కలిపి విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్  స్కామ్‌లో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా వివరాలు సేకరించింది. 

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Embed widget