By: ABP Desam | Updated at : 16 Apr 2023 11:15 PM (IST)
హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ లో సిద్ధు జొన్నలగడ్డ
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఫ్యామిలీతో కలిసి వచ్చి ఆనందంగా గడపడానికి అడ్డా మారిన గేమ్ జోన్స్ ఇప్పుడు సమ్మర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ వచ్చాయి. అసలే టెన్షన్ పెద్దలకు వర్క్ టెన్షన్, బిజినెస్ టెన్షన్.. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులను పక్కనపెట్టి వీకెండ్ లో సరదాగా గడపాలని నగరవాసులు భావిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈ గేమ్ జోన్స్ లో చిన్నారులు, కాలేజీ విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు.
సరికొత్త క్రీడా వినోదాన్ని పంచేందుకు హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటుచేసిన హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను టాలీవుడ్ హీరో, డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు ప్రారంభించారు. దాదాపు 100 క్రీడలు, వీఆర్ గేమ్స్, బౌలింగ్ ఆలే, పార్టీ వేడుకలకు సంబంధించిన జోన్ లను ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలకు, యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని ఏర్పాటు చేశారు.
ఆదివారం ఈ గేమింగ్ జోన్ ను ప్రారంభించిన అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఆనందం రెట్టింపు చేసే ప్లేస్ ఇది. చిన్నారులకు, యువతను ఈ ప్రాంతం ఖచ్చితంగా కట్టి పడేస్తుంది. శరీరానికి, మెదడుకు పదునుపెట్టేలా ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారని అన్నారు. హాల్ ఆఫ్ గేమ్ డైరక్టర్ హితేష్ చందానీ మాట్లాడుతూ.. ఇక్కడ సరికొత్త గేమింగ్ ను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక కొత్తదనాన్ని సృష్టించి అందుబాటులోకి తీసుకురావడం వెనుక ఎంతో కష్టం ఉందన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ఆనందంగా సమయం గడపవచ్చన్నారు. ఇక్కడ ఆటలు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన అన్నారు.
నాలుగు లేన్ల బౌలింగ్ ఆలేతోపాటు పార్టీ జోన్లు, ఫుడ్ కోర్టులు ఇలా అన్నింటిని ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చామన్నారు. అంతులేని ఆసందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఖచ్చితంగా రావాలని ఆనం మీర్జా అన్నారు. ఇది ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందన్నారు.
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!