అన్వేషించండి

Bhatti Vikramarka Fires on BRS MLAs: అసెంబ్లీలో కాగితాలు చింపేసిన BRS ఎమ్మెల్యేలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కాగితాలు చించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. చూస్తూ ఊరుకుంటుంటే ఇదేం పనంటూ అసహనం వ్యక్తం చేశారు.

Debate on Kaleshwaram project | హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ పీక్స్ కు చేరింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka) మాట్లాడుతున్న సమయంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నేతల అరుపులు, కేకలు లెక్క చేయకుండా భట్టి తన ప్రసంగం కొనసాగించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై భట్టి ఏమన్నారంటే.. నివేదికను ప్రజల ముందు ఉంచాలా, దాచి ఉంచాలా, రాజకీయ దురద్దేశ్యంతో వెళ్లాలని మేము ఆలోచించలేదు. నేరుగా సభలో కమిషన్ నివేదిక పెట్టాము. సభ ఏం చెబితే , అదే విధంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. కమిషన్ నివేదికలో అధికారులపైనా ఆరోపణలు వచ్చాయన్నారు.

సీఎం, మంత్రులు నిర్ణయాలతో కుంగిన కాళేశ్వరం..

మాది పొలిటికల్ డ్రామా కాదు, ఇది సర్కస్ కంపెనీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి సీఎం కేసీఆర్ చెబితే నాటి మంత్రి హరీష్ రావు కట్టారు. ఇంజనీర్లు చేయాల్సిన పనులు సీఎం, మంత్రులు చేస్తే ఇలా కాళేశ్వరంలా కుంగిపోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కృష్ణా, గోదావరి నదులపై ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులతోపాటు ఏ ప్రాజెక్టును వదిలిపెట్టకుండా, రీడిజైన్ పేరుతో వేల కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారు. విపరీతంగా అంచనాలు పెంచి దోచుకున్నారు. కేవలం 1450 కోట్లతో అయ్యే ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టును 25వేల కోట్లకు అంచనాలు పెంచి దోచుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం కమిషన్ పై అపవాదులు వేయడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు కనీసం మైక్ ఇవ్వకపోయినా , ఇబ్బందిపెట్టినా భరించాం. మేం అలా చేయడంలేదు. మాట్లడేందుకు ప్రతిపక్షనేతలకు అవకాశం ఇస్తున్నాం. కేసీఆర్ కూడా సభకు రావాలి. కాళేశ్వరం నివేదికపై వివరణ ఇవ్వాలి. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లడటం హరీష్ రావు మానుకోవాలన్నారు డిప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజల సొమ్ము దొపిడీకి గురైయ్యింది. ఓవైపు నీళ్లు లేవు, మరోవైపు కోట్లాది రూపాయలు వృధా ఖర్చు జరిగిందన్నారు. 

సభలో కాగితాలు చించడంపై ఆగ్రహం..
కాళేశ్వరం కమిషన్ నివేదికను చెత్త బుట్ట అని హరీష్ రావు అనడం సరికాదు. చెత్తబుట్ట అంటే ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు ఇక్కడ వేశారో అందరికీ తెలుసు అని భట్టి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పై ఏం చేద్దామో మాట్లడకుండా, ఇతర విషయాలు మాట్లడం సరికాదు. సభ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఇచ్చిన అంశంపై మాట్లడకుండా మిగత అన్ని విషయాలు మాట్లాడటం మానుకోవాని కోరారు. సభను తప్పుదోవ పట్టిస్తూ నిరసలను చేయడం సరికాదన్నారు భట్టి విక్రమార్క. పోడియం వద్ద నిరసనలు చేయడం మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో కాగితాలు చించడంపై మండిపడ్డారు. మిగతా సభ్యులకు మాట్లడే అవకాశం ఉందని మర్చిపోతున్నారు. అందరూ మాట్లడే విధంగా అవకాశం ఇవ్వాలంటూ అసహనం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget