అన్వేషించండి

Delhi Liquor Case: నేను అప్రూవర్‌గా మారలేదు - తప్పుడు వార్తలపై అరుణ్ రామచంద్ర పిళ్లై ఆగ్రహం

Delhi Liquor Case: తాను అప్రూవర్ గా మారినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై అరుణ్ రామచంద్ర పిళ్లై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. 

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై తాను అప్రూవర్ గా మారలేదని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారారని వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వివరించారు. ఈ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్న వారు.. నిజానిజాలేంటో తెలుసుకోవాలని రామచంద్ర పిళ్లై తరఫు న్యాయవాదులు సూచించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిళ్లై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఎమ్మెల్సీ కవిత బినామీ అంటూ పిళ్లైపై అభియోగాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారని పలు వెబ్ సైట్లు, టీవీలు, పేపర్లలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పిళ్ళై నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారని రాసుకొచ్చారు. కానీ వీటన్నిికీ చెక్ పెడుతూ... పిళ్లై తాను అప్రూవర్ గా మారలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలనీ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. గత మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపులోని పలువురు సభ్యులు అప్రూవర్‌గా మారారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై కంటే ముందుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్స్‌గా మారిన వారిలో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇటీవల అప్రూవర్‌గా మారిన మాగుంట

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల వ్యక్తుల నుంచి ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు భావిస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 

ఢిల్లీ మద్యం కేసులో తొలుత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారగా, ఆయన తర్వాత మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై బయట ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు. అప్రూవర్‌గా మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు పెంచింది. పలువురు కీలక వ్యక్తులను విచారించింది. ఈడీ విచారణలో మాగుంట కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget