By: ABP Desam | Updated at : 27 May 2023 01:47 PM (IST)
హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కేజ్రీవాల్ చర్చలు, కేంద్రంపై పోరాాటానికి మద్దతివ్వాలని రిక్వస్ట్
కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. ఇప్పటికే మమత, నితీష్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపబోతున్నారు.
ఢిల్లీలో సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి సీఎంను కలవనున్నారు.
కేసీఆర్‌తో సమావేశమై పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరనున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఇప్పటికే బంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిసి కూడా చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశంకానున్నారు.
కేజ్రీవాల్‌కు ఇప్పటికే బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మద్దతు పలికారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.
ఆర్డినెన్స్ ఏంటంటే
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరోసారి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్ బదిలీల నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే ఆ అంశంలో నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతకాల సమావేశంలో ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది.
వాహనాల వేలం ద్వారా రూ.6.75 కోట్లు, త్వరలో మళ్లీ వేలం వేస్తామన్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
Hyderabad News: కుప్పకూలిన బతుకులు, స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
Telangana Elections 2023: కాంగ్రెస్ నుంచి బీసీలకు 34 సీట్లు ఇవ్వాల్సిందే : మధుయాష్కీ గౌడ్ డిమాండ్
Minister Sabita Indra Reddy: కందుకూరులో కూరగాయలు కొన్న మంత్రి సబిత-పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్ ఇదే- ఏబీపీ సీఓటర్ సర్వే ఫలితాలు
/body>