New Year Parties in Hyderabad : న్యూ ఇయర్ 2025 పార్టీ - బ్యాచిలర్స్ కోసం హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్స్
New Year Party 2025 : న్యూ ఇయర్ 2025 పార్టీలు, ఈవెంట్స్ కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్స్ లో సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నారు.
New Year Party 2025 : న్యూ ఇయర్ 2025 పార్టీని గ్రాండ్ గా జరుపుకోవడానికి అనేక రకాల ఈవెంట్స్, పార్టీలు, స్టేకేషన్ ఆప్షన్‌లను అందిస్తూ, అద్భుతమైన న్యూ ఇయర్ వేడుక కోసం హైదరాబాద్ సిద్ధమవుతోంది. మీరు నైట్ టైంలో పార్టీలు చేసుకోవాలనుకున్నా, లైవ్ పర్ఫార్మెన్స్ లను ఆస్వాదించాలనుకున్నా లేదా విలాసవంతమైన సెట్టింగ్‌లో విశ్రాంతి తీసుకోవాలనుకున్నా, హైదరాబాద్‌లో ప్రతిఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది. దాదాపు చాలా ఈవెంట్స్ కు వెళ్లాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే బ్యాచిలర్స్ లేదా ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ పార్టీని జరుపుకోవాలనుకునే వారి కోసం ఏమేం ఈవెంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈవెంట్
శ్రీలీల డ్యాన్స్ ను లైవ్ లో చూడాలనుకునేవారి కోసం నోవాటెల్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక్కడ ఆమె డ్యాన్స్ తో పాటలు అద్భుతమైన పాటలు పాడే లైవ్ బ్యాండ్ కూడా పాల్గొనబోతోంది. టాటూ జోన్, మ్యూజిక్ షో వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.1499.
రామ్ మిరియాల ఈవెంట్
గౌలిదొడ్డిలో ఉండే ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు సింగర్ రామ్ మిరియాల అతిథిగా రానున్నారు. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.2499. ఆయనతో పాటు డీజేలు కూడా ఉంటారు. డ్రింక్స్, మాక్ టైల్స్. కాక్ టైల్స్, లిక్కర్, నాన్ వెజ్ అండ్ వెజ్ స్టార్టర్స్ కూడా అందించనున్నారు.
మోహన భోగరాజు ఈవెంట్
ఈ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించే అత్యంత ఖరీదైన పార్టీల్లో ఒకటి. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.4,999. సింగర్ మోహన భోగరాజు లైవ్ షోతో పాటు నాన్ స్టాప్ మ్యూజిక్, డ్యాన్స్ ఉంటుంది. 21ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతి ఉండనుంది. డిసెంబర్ 31న రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యే ఈ షో మాదాపూర్ లోని రాస్తాలో జరగనుంది.
బుక్ మై షోలో టిక్కెట్లు
పైన చెప్పిన ఈవెంట్స్ లో ఎంజాయ్ చేయాలనుకునే వారు బుక్ మై షో సైట్ నుంచి టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీకి అటెండ్ అయ్యేందుకు యువత అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.
వీటితో పాటు
హైదరాబాద్‌లోని బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2O25 (ఓపెన్ ఎయిర్) : పవర్‌పఫ్ గర్ల్స్, ఢిల్లీ మొట్టమొదటి విమెన్ DJ బైస్డ్ లైవ్ బ్యాండ్, లైవ్ మ్యూజిక్, DJ బీట్స్ తో పాటు ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్‌లతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించండి. సరదా, సంగీతం, మెగా-వాట్ ఎనర్జీతో అబ్బురపరిచే నైట్ కోసం HITECH ARENAలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025లో చేరండి.
స్థలం: హైటెక్ అరేనా
ధర: రూ. 299
తేదీ & సమయం: 31 డిసెంబర్, 2024 - సాయంత్రం 7 గంటల నుంచి
Amal Mallik Live:
ప్రఖ్యాత అమల్ మల్లిక్, ఆయన బ్యాండ్ చేత మంత్రముగ్దులను చేసే లైవ్ ఈవెంట్ డిసెంబర్ 31న జరగనుంది. ఈ రాత్రికి సరైన టోన్‌ను సెట్ చేయడానికి మనోహరమైన మెలోడీస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫ్రామెన్స్ లను అందిస్తుంది.
ధర: రూ. 1299 నుంచి
వేదిక: HITEX ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
తేదీ & సమయం: డిసెంబర్ 31, 2024 - 7గంటల నుంచి
Also Read : High Blood Pressure : బీపీ ఎక్కువగా ఉండేవారు తినకూడని ఆహార పదార్థాలు ఇవే.. తినాల్సిన ఫుడ్ లిస్ట్