అన్వేషించండి

Telangana DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!

Telangana DGP CV Anand: తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. శివధర్ రెడ్డి స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు.

Telangana DGP CV Anand: తెలంగాణలో కొత్త డీజీపీపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్‌ను నియమితులయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ చాలా కాలం సైబరాబాద్, హైదరాబాద్, విజయవాడ సీపీగా పని చేసి సంచలనమైన కేసులు ఛేదించారు. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనంద్‌, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న బి. శివధర్ రెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. 

Image

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూపీఎస్సీ ప్యానెల్‌ ఎంపిక చేసి ముగ్గురు అధికారుల జాబితాలో సీనియారిటీ ప్రాతిపదికన ఆనంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. 

క్రికెట్ బ్యాట్‌ నుంచి లాఠీ వరకు... 

సీవి ఆనంద్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. 1968 జూన్ 5న రంగారెడ్డి జిల్లాలో జన్మించిన ఆయన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. నిజాం కాలేజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించారు. యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. భారత్ అండర్ -19 జట్టు తరఫున ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే తన మొదటి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికై, క్రీడా రంగాన్ని వదిలి సమాజ సేవకు వచ్చారు. ఒకవేళ ఆ రోజుల్లో ఐపీఎల్ ఉండి ఉంటే, తాను ఐపీఎస్‌ అయ్యేవాడిని కాదేమోనని ఆయన స్వయంగా చాలా సార్లు కామెంట్‌ చేశారు. 

ఐపీఎస్ అయిన తర్వాత వరంగల్ , ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఎస్పీగా, ఎస్పీగా పని చేసి చాలా కాలం శాంతి భద్రతలను అదుపులో ఉంచి ప్రశంసలు అందుకున్నారు. నక్సలైట్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 

హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా ఉన్న టైంలో ఆయన ప్రవేశ పెట్టిన ఈ-చలాన్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. హుస్సేన్ సాగ్ వద్ద ఆత్మహత్యలను నిరోధించడానికి లేక్ పోలీస్‌ విభాగం ఏర్పాటు చేయడం ఆయన ఆలోచనల నుంచి వచ్చిందే. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషర్‌గా రెండుసార్లు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సైబరాబాద్ కమిషనర్‌గా పని చేసిన కాలంలో మహిళా భద్రత కోసం షీ టీమ్స్ బలోపేతం చేయడం, ఐటీ కారిడార్‌ భద్రత పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.  

ఆధునిక పోలీసింగ్‌ో సాంకేతికత వాడకంపై ఆనంద్‌ ఎప్పుడూ ముందు ఉంటారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ కోసం గూగుల్‌ మ్యాప్స్‌, డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రోత్సహించారు. ఆపరేషన్ రోప్‌ ద్వారా నగరంలో ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణలో సత్ఫలితాలు సాధించారు. నేర పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ వినియోగం ద్వారా పాత నేరస్థులను పట్టుకోవడంలో ఆయన చొరవ చూపించారు. 

మత్తు పదార్థాల నియంత్రణలో సీవీ ఆనంద్ చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆయన నేతృత్వంలోని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫ్రోస్‌మెంట్ వింగ్ దుబాయ్ వరల్డ్ పోలీస్ సమ్మిట్‌-2025లో ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌లెన్స్ అవార్డును గెలుచుకుంది. 138 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో భారత్ తరఫున ఈ అవార్డు అందుకోవడం తెలంగాణ పోలీసులకే కాక దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. 

సీవీ ఆనంద్ విధుల్లో ఎంత టఫ్ ఉంటారో ఫుడ్ , హెల్త్ విషయంలో అంతే కఠినంగా ఉంటారు. సర్వీస్‌లో చేరినప్పుడు వేసుకున్న టీ షర్ట్ రిటైర్మెంట్‌ వరకు సరిపోయేలా ఉండాలని ఆయన జూనియర్లకు చెబుతుంటారు. చిరుధాన్యాలకు, శాకాహార భోజనానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి రోజూ టెన్నిస్, క్రికెట్ గోల్ఫ్‌ ఏదో ఒకటి ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా ఫిట్‌నెస్ కాపాడుకుంటూ వస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPS Uday Krishna Reddy Suicide Note: మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Hyderabad Latest News: హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  
హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget