Komatireddy Rajagopal Reddy Comments: 'మళ్లీ అసెంబ్లీకి రాను' కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన
Komatireddy Rajagopal Reddy Comments: తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకకటన చేశారు. ఇకపై సభకు రానని ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.

Komatireddy Rajagopal Reddy Comments: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. మద్ధతుదారులతో అసెంబ్లీకి వచ్చిన ఆయన ఇకపై సభకు రానని అన్నారు. ప్రజలంతా వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. చాలా కాలంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ చేస్తూ వస్తున్నారు.
మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెషర్ పాలిటిక్స్‌కు మరింత పదును పెట్టారు. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉంటానంటూ వెల్లడించారు. ఓవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తితే వాటిని పట్టించుకోకుండా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటనే కోణంలో ఆయన సరికొత్తగా ఒత్తిడి పెంచుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు రాజగోపాల్ రెడ్డి తన మద్ధుతుదారులతో భారీ ర్యాలీగా అమరువీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. తన అనుచరులు ముఖ్య నాయకులతో కలిసి అక్కడ కాసేపు గడిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ టైంలోనే మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. "అమరవీరుల స్థూపం అంటే గుడితో సమానం. రాష్ట్రం కోసం ప్రాణాత్యాగం చేసిన అమరవీరులు ప్రజల గుండెల్లో సజీవంగా బ్రతికి వుంటారు. ఈ రోజు అసెంబ్లీ తరువాత మళ్ళీ అసెంబ్లీకి రాను. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారు. వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తా, వారికి అండగా ఉంటాను. " అని చెప్పుకొచ్చారు.






















