అన్వేషించండి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

షర్మిలకు ఇప్పుడు అర్జెంట్‌గా ఎక్కడో సీఎం అయిపోవాలనే కోరిక బలంగా ఉందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. జగన్‌తో మాట్లాడి ఆమె కోరిక తీర్చేయాలని విజయలక్ష్మికి ఓ సలహా ఇచ్చారు.

తెలంగాణ పాదయాత్ర చేస్తూ హాట్ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో షర్మిల అనవసరమైన న్యూసెన్స్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కాళ్లు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవలేరని విమర్శించారు.  

తెలంగాణలో ఎలా గెలవాలో బీజేపీకి అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు పోటీ టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందని అభిప్రాయపడ్డారు. కానీ అనవసరమైన కామెంట్స్ షర్మిల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమ్మాయి కదా అని ఏం అనలేక పోతున్నామన్నారు. అందులోనూ తమ నాయకుడు వైఎస్ బిడ్డ కదా అని ఆలోచనామని కూడా అభిప్రాయపడ్డారు. అసలు తనతో షర్మిలకి పంచాయితీ ఏందో అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. 

షర్మిలకు ఇప్పుడు అర్జెంట్‌గా ఎక్కడో సీఎం అయిపోవాలనే కోరిక బలంగా ఉందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. జగన్‌తో మాట్లాడి ఆమె కోరిక తీర్చేయాలని విజయలక్ష్మికి ఓ సలహా ఇచ్చారు. అంతేకానీ మీ ఇంటి పంచాయితీని జనంపై రుద్దకండి అని సూచన చేశారు. అక్కడి సఎంల పంచాయితీల కోసం ఇక్కడ గొడవలు పెట్టొద్దన్నారు. ఎలాగో ఏపీలో మూడు రాజధానుల పంచాయితీ నడుస్తోందని... దానికి బదులు మూడు రాష్ట్రాలు చేసుకుంటే వైఎస్‌ ఇంటి సమస్య తీరిపోతుందన్నారు. ఎలాగో మోదీకి జగన్‌ గులాం అయ్యారని ఫ్యామిలీ మొత్తం మోదీ వద్ద కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు. అమరావతికి జగన్ సీఎం అయితే.. కడప, కర్నూలుకు షర్మిల, వైజాగ్‌కి విజయసాయిరెడ్డి సీఎంగా చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. 

ఏదో చుట్టరికం తోక పట్టుకొని తాను కేటీఆర్‌ కోవర్ట్ అంటూ షర్మిల తనపై నింద వేశారన్నారు. గతంలో తమ పార్టీ వాళ్లు కూడా ఇలాంటి విమర్శలు చేశారని గుర్తు చేశారు. అది ఇప్పుడు తనకు శాపమైందన్నారు. కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తనకు దొరగడం లేదన్నారు. ఈ అంశంలో తన పార్టీ వాళ్లే బద్నాం చేశారని ఆవేదన్ వ్యక్తం చేశారు. 

తాను అన్ని మతాలకు సమన్వయకర్తనని... షర్మిల లెక్క బీజేపీకి ఏజెంట్‌ను మాత్రం కాదన్నారు జగ్గారెడ్డి. తనపై మళ్లీ మళ్లీ విమర్శళు చేస్తే మాత్రం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా పులి లెక్కే ఉన్నానని... మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే రిగ్గింగ్ చేసి మూడు మున్సిపాలిటీలు గెలిపించానన్నారు. ఆ దమ్ము చూసే వైఎస్ తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. వైఎస్‌కి నచ్చిన నేను.. షర్మిలకు నచ్చలేదు అంటే ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. 

నోరు అదుపులో పెట్టుకో షర్మిలా అంటూ ఘాటుగా హెచ్చరించారు జగ్గారెడ్డి. వైఎస్ మోతుబరి కానీ షర్మిల కాదన్నారు. శత్రువు వచ్చినా ఆత్మీయత చూపెడతారన్నారు. వైఎస్ గుణాలు షర్మిలకు లేనేలేవని తేల్చేశారు. షర్మిల లెక్క చిల్లర ముచ్చట్లు వైఎస్‌ దగ్గర లేవన్నారు. తనను వ్యభిచారి అన్న షర్మిలకు అదే మాట తాను అంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేరెక్టర్‌ గురించి మాట్లాడొద్దని షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి అంటే ఊరుకోను అన్నారు. పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా... ఏం తమాషాలు చేస్తున్నావా ..?  బుద్ది ఉందా నీకు.... ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు అన్నారు. మళ్ళీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలా డెప్త్ విషయాలు మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అందరికీ బలహీనతలు ఉంటాయని అన్నీ చెప్తానంటూ కన్నెర్ర చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అంసతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
కాంగ్రెస్ సీనియర్ల అంసతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Shock for Gold Men: బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Ramayana OTT : రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump:అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాానాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాానాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Tu Yaa Main OTT : పూల్‌లో మొసలి... లవర్స్‌కు బిగ్ షాక్ - ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై'
పూల్‌లో మొసలి... లవర్స్‌కు బిగ్ షాక్ - ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై'
Embed widget