అన్వేషించండి

Telangana Talli Statue: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి- విగ్రహం రూపకర్త, శిల్పిలకు ప్రభుత్వం సన్మానం

Telangana Mother Statue | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. భారీ ఎత్తున ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Revanth Reddy Unveils Telangana Talli Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులు, నేతలు, ప్రజల సమక్షంలో రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం పూలు చల్లి తెలంగాణ తల్లికి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ’జయజయహే తెలంగాణ’ ప్రదర్శించారు. ఒక జాతి వ్యక్తిత్వానికి, జాతి అస్తిత్వానికి, సాంస్కృతిక చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న విగ్రహమని ప్రభుత్వం చెబుతోంది. ప్రజాకవి, ప్రకృతి కవి అందెశ్రీ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించారని తెలిసిందే. రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీని తెలంగాణ ప్రభుత్వం శాలువా కప్పి సన్మానించింది. 

Telangana Talli Statue: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి- విగ్రహం రూపకర్త, శిల్పిలకు ప్రభుత్వం సన్మానం

అందెశ్రీ మాట్లాడుతూ.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చైతనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు చేశారు.

పల్లవి:
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ 

చరణం:(1)
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
అనునిత్యము నీగానం అమ్మనీవే మా ప్రాణం

జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

చరణం:(2)
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

విగ్రహం రూపర్త, శిల్పిలను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్. ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.  తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన శిల్పి రమణా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. రమణారెడ్డి ఎంఏ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. భారత ప్రభుత్వం తరఫున పలు దేశాల్లో పర్యటించిన తన కళను ఇతర దేశాలకు పరిచయం చేశారు.

Also Read: Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే రోజు నేడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Embed widget