అన్వేషించండి

CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

Charminar Tragedy | హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది చనిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: నగరంలోని పాత బస్తీ చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Charminar Fire Accident)పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం ఘటనలో మొదట 8 మంది మృతిచెందారు. చికిత్స పొందుతూ మరో 8 మంది చనిపోగా, మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన  అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతామని, మెరుగైన వైద్య చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించి ఏకంగా 16 మంది చనిపోవడం బాధాకరం అన్నారు.


CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు. ఇరుకైన గల్లీ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తుతుందని సమాచారం.

8  మంది మృతులను ఆరుషి జైన్‌ (17), అభిషేక్‌ మోడీ (30), షీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలి గుప్తా (7), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72)లుగా పోలీసులు గుర్తించారు.


CM Revanth Reddy: చార్మినార్ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి 

మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి.. వారిని చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద, అపోలో, డీఆర్‌డీవో, ఉస్మానియా హాస్పిటల్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి కొందరు, పొగ పీల్చడంతో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్యులు పలువురు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల 30 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఓవైపు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతూ, మరోవైపు కాలిన గాయాలైన వారిని రెస్క్యూ చేసి అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బందికి మెరుగైన శిక్షణ అవసరం: కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా, సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న ప్రమాదమే అయినప్పటికీ, ప్రాణ నష్టం అధికంగా ఉందని.. సరైన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడితే మెరుగైన ఫలితాలు వచ్చేవయన్నారు. అగ్నిమాపక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం సరైన పరికరాలు, మెరుగైన శిక్షణ అందించాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ టెక్నాలజీ మెరుగుపరుచుకోవాలని, సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు చేపడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget