News
News
X

KCR: మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత.. నేడు అంత్యక్రియలకు జహీరాబాద్‌కు సీఎం కేసీఆర్

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు

FOLLOW US: 

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబరు 15న అస్పత్రిలో చేరారు. ఆయనకు ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రులు హరీశ్ రావు, కొప్పులు ఈశ్వర్, జగదీష్ రెడ్డి, తదితర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ అంత్యక్రియలు నేడు జహీరాబాద్‌లో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు.

కాంట్రాక్టర్ నుంచి మంత్రిగా..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్‌ 1959, అక్టోబరు 14న జన్మించారు. ఆయన తండ్రి ఎండీ ఫక్రొద్దీన్‌ ఉపాధ్యాయుడు. బీకాం వరకు చదివిన ఫరీదుద్దీన్‌ 1978లో కాంగ్రె్‌సలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. వృత్తి పరంగా ఫరీదుద్దీన్‌ ఏవన్‌ కాంట్రాక్టర్‌. ఆయన మొదట సర్పంచుగా, అనంతరం జహీరాబాద్‌ వైస్‌ ఎంపీపీగా 1985 నుంచి 90 వరకు పనిచేశారు. 1992-1995 వరకు పీఏసీఎస్‌ ఇప్పెపల్లి సొసైటీకి చైర్మన్‌గా సేవలందించారు. 1990-1999 వరకు కాంగ్రెస్‌ జహీరాబాద్‌ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004 ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జహీరాబాద్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరారు.

2016లో ఎమ్మెల్యేల కోటలో ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీ పదవీకాలం 2021, జూలై 3న ముగిసింది. అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఫరీదుద్దీన్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 09:59 AM (IST) Tags: telangana news cm kcr KCR Zaheerabad tour Fareeduddin death KCR latest news

సంబంధిత కథనాలు

MLC Kavitha: మునుగోడు మాదే- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే: కవిత

MLC Kavitha: మునుగోడు మాదే- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే: కవిత

నెక్స్ట్‌ తెలంగాణ డీజీపీ ఎవరు? పోటీలో ఎవరెవరున్నారంటే?

నెక్స్ట్‌ తెలంగాణ డీజీపీ ఎవరు? పోటీలో ఎవరెవరున్నారంటే?

Hyderabad: హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్స్ టెన్షన్! నిండుతున్న ఆస్పత్రులు - ఆ జ్వరాన్ని ఇలా గుర్తించండి

Hyderabad: హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్స్ టెన్షన్! నిండుతున్న ఆస్పత్రులు - ఆ జ్వరాన్ని ఇలా గుర్తించండి

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు

KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Mohan babu : షిరిడి కన్నా తమ గుడే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu :  షిరిడి కన్నా తమ గుడే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !