Malla Reddy University: ఘనంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వొకేషన్ డే, తన జీవితం ధన్యమైందన్న మల్లారెడ్డి
Malla Reddy At Malla Reddy University | మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వొకేషన్ డే ఘనంగా నిర్వహించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఛైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన జీవితం ధన్యమైందన్నారు.
1st Convocation Day at Malla Reddy University | కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వొకేషన్ డే జులై 6న ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజిటల్ పాలిటిక్స్ లలో కలిపి మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి మొదటి బ్యాచ్ విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా లక్షల ప్యాకేజీలతో జాబ్స్ సాధించడంపై ఛైర్మన్ మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజుతో తన జీవితం ధన్యమైందన్నారు యూనివర్సిటీ వ్యవస్థాపకులు మల్లారెడ్డి.
మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఫౌండర్(చైర్మైన్), తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి, వర్సిటీ రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పైటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలీనీ రెడ్డి, ప్రీతిరెడ్డి,ప్రవిణ్ రెడ్డిలు పాల్గొన్నారు. మొదటగా వీరు జ్యోతి ప్రజ్వలన చేసి కాన్వొకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూలు మాత్రమే ఉండేవని ఇప్పుడు ప్రైవేట్ పరంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా అందుబాటులో ఉందన్నారు. భవిష్యత్తులో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండే రోజులు తీసుకొస్తామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విద్యా్ర్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు.