TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
పేపర్ లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడంటే అది సీఎం కార్యాలయమంటూ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ABP దేశం ప్రత్యేక ఇంటర్వ్యూలో RS ప్రవీణ్ కుమార్ పలు విషయాలు ప్రస్తావించారు.
TSPSC పేపర్ లీకేజీలపై సిట్ విచారణ వల్ల అసలు దోషులను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు BSP రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పేపర్ లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడంటే అది సీఎం కార్యాలయమంటూ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ABP దేశం ప్రత్యేక ఇంటర్వ్యూలో RS ప్రవీణ్ కుమార్ మాట్లడుతూ.. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్ద TSPSC , కానీ అటువంటి బోర్డులో విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎవరు లీకులు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏ మండలంలో ఎంత మంది అభ్యర్దులు పరీక్షలు రాశారు, ఎంత మందికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఎవరెవరు క్వాలిఫై అయ్యారనే సమాచారం లెక్కలతో సాహా కేటీఆర్ ఎలా చెబుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కు ఆ సమాచారం తెలుసుకునే అధికారం ఎవరు ఇచ్చారని ప్రవీణ్ కుమార్ అడిగారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీక్స్ విచారణను తప్పుదోవపట్టిస్తోందని, సిఎం కార్యాలయం ప్రమేయం ఈ కేసులో ఉందనే విషయాన్ని మేము మొదటి నుండి అనుమానిస్తున్నామని, అనుకున్నట్లే కేటీఆర్ మాటల్లో ఇదే విషయం స్పష్టమవుతోందని తెలిపారు.
ఓ హత్య జరిగి బాధితులకు అన్యాయం జరిగితే ఎస్సై ను సస్పెండ్ చేస్తారు, భూఅక్రమాలు జరిగితే ఎమ్వార్వోను సస్పెండ్ చేసారు. మరి ఇంతలా సంచలనం సృష్టించి, వేలాది మంది విద్యార్దుల ఉసురు తీసిన TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో చైర్మెన్ జనార్ధనరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పేపర్ లీకేజికి ప్రధాన బాధ్యుడు చైర్మన్ , ప్రశ్నాపత్రాలను గోప్యంగా ఉంచడంతోపాటు వాటి వివరాలు వివరాలు, అందులో సమాచారం లీకవ్వడం చూడాల్సిన బాధ్యత మొదట చైర్మన్ పై ఉంటుందని, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన చైర్మెన్ ను ఎందుకు సిట్ ప్రశ్నించడంలేదన్నారు. ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ చైర్మన్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సిఎం కార్యాలయంలో ఉండే ఓఎస్ డీ బావ , TSPSC లో పనిచేస్తున్నాడని బావమరిది కోసమే లీకేజ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వీళ్లను రక్షించేందుకు మొదటి నుండి సిఎం కార్యాలయం ప్రత్నిస్తోందని అందుకే కేసును సిట్ విచారణ అంటూ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
టీఎస్ పీఎస్సీలో ఉద్యోగులు డబ్బుకోసమే పేపర లీకేజ్ కి పాల్పడ్డారనే విషయం ఉన్నాధికారులకు తెలిసే జరిగిందంటున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన కుట్రదారులను పక్కనపెట్టి లబ్దిదారులను సిట్ టార్గెట్ చేస్తోందని తెలిపారు.ప్రత్యేర్ది రాజకీయ పార్టీనేతలకు నోటిసులు ఇచ్చిన సిట్ అధికారులు , అభ్యర్దుల సమాచారాన్ని లెక్కలతో సహాచెబుతున్న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే సాహసం చేయగలరా అంటూ ప్రశ్నించారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సిట్ విచారణలో అమాయకులను ఇరికించి, బడా నేతలను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సిట్ విచారణ ద్వారా న్యాయం జరగదని ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యూజిల్యాండ్ వరకూ ప్రశ్నాపత్రాలు వెళ్లాయంటే భారీ స్దాయిలో నగదు మార్పిడి జరిగిందనేది స్పష్టమవుతోందన్న ప్రవీణ్ కుమార్ ఈడీ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్దలు సైతం ఈ వ్యవహారంలో జరిగిన మనీ లాండరింగ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్దులకు అండగా ప్రభుత్వ తీరుపై గ్రామ గ్రామాన నిరసనలు చేస్తామన్నారు.