KTR: యథాలాపంగా చేసిన కామెంటే, మహిళలను కించపరిచే ఉద్దేశం లేదు- విచారపడుతున్నా: కేటీఆర్
Telangana: ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే బస్సుల్లో మహిళలు అవసరమైతే డ్యాన్స్‌లు కూడా చేస్తారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీనిపై విచారం వ్యక్తం చేశారు.
BRS: ఆగస్టు 15 నాడు పార్టీ నేతల సమావేశంలో చేసిన కామెంట్స్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. యథాలాపంగా చేసిన కామెంట్స్‌కు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఎక్స్‌లో పోస్టు చేశారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు.
కామెంట్స్‌పై కేటీఆర్ విచారం
కేటీఆర్ ఏమన్నారంటే" నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు." అని ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
— KTR (@KTRBRS) August 16, 2024
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
బస్సుల్లో డ్యాన్స్‌లంటూ కామెంట్స్
ఉచితంగా బస్సుల్లో వెళ్తున్న కొందరు కూరగాయలు అమ్మడం, బ్రష్ చేయడం, వెల్లుల్లి ఒలుస్తూ, కుట్లు వేస్తూ కనిపించడంపై కేటీఆర్ స్పందించారు. కుట్లు, అల్లికలే కాదు. అవసరమైతే డ్యాన్సులు కూడా చేసుకోండని అన్నారు. తాము తప్పు అని అనడం లేదని.. బస్సులు పెంచండని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.
KTR's objectionable comments on women
— Congress for Telangana (@Congress4TS) August 15, 2024
మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్.
మనిషికో బస్సు పెట్టండి ...కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్ లు, రికార్డింగ్… pic.twitter.com/Ytv04X4vwc
ఫైర్ అయిన సీతక్క
కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్న సీతక్క... వెంటనే బేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లను అవమానించేలా డ్యాన్సులు చేసుకోండని కామెంట్ చేయడం ఆయన బుర్రలో ఉన్న బురదకు నిదర్శమంటూ విమర్శించారు. గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో క్లబ్‌లు, పబ్‌లు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర కేటీఆర్‌ది ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, సాధికారత సాధించాలనే లక్ష్యంతో వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీతక్క ఘాటుగా స్పందించారు. మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Minister Seethakka strongly condemned KTR's inappropriate comments on women
— Congress for Telangana (@Congress4TS) August 15, 2024
మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి సీతక్క
👉 ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేయించే సంస్కృతీ మీకుందేమో..!
👉 మహిళల పట్ల మీకున్న మర్యాద, గౌరవం ఇదేనా ?… https://t.co/A8olpSzH5D pic.twitter.com/4GzHnscQTV
Also Read: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా? - కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం