అన్వేషించండి

Harish Rao: తప్పుడు రాతలతో నిజాయితీని దెబ్బతీయొద్దు- లేకుంటే చర్యలు తప్పవు- మీడియాకు హరీష్‌ స్వీట్ వార్నింగ్

Telangana News: తప్పుడు రాతలతో నిజాయితీని దెబ్బతీయొద్దన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాలు ఉంటే తనకు కాల్ చేయాలన్నారు.

BRS Party: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అని, పార్టీ మారుతున్నారని హరీష్‌రావుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తమ నాయకుడు కేసీఆర్ చెప్పిన పని చేసుకుంటూ వెళ్లడమే తనకు తెలుసన్నారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఇకపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీష్‌రావు బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలను ఖండించారు. వ్యూస్ కోససం ఓ నాయకుడి నిబద్ధతను, నిజాయతీని దెబ్బతీయొద్దని మీడియాకు హితవుపలికారు.  అలాంటివి మానుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఘాటుగా చెప్పారు. 

సంచలనాల కోసం తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్‌లో చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. "వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అయ్యానని, కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏవేవో చెబుతున్నారు. దయచేసి ఇలాంటి పెట్టకండి. లైక్స్, వ్యూస్ కోసం నాయకుడి నిబద్ధత, నిజాయితీని దెబ్బతీయకండి. ఇలాంటివి మానుకోకపోతే లీగల్ చర్యలు  తీసుకోడానికి  వెనుకాడబోం." అని అన్నారు. 
అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై మండిపడ్డారు. "గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్

కమిషన్ ఛైర్మన్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం చేతుల్లోనే అంతా ఉందంటున్నారు. ప్రజా దర్బార్‌కు వెళ్లి కాళ్లమీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరామ్ దగ్గరికి వెళ్లినా స్పందన లేదు. కొత్త  హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలన అమలు చేయమని కోరుకుంటున్నారు." 

"కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరఫున 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. గ్రూప్ 1కు 1:100 చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 2కు 2వేలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి. పరీక్షల మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జులైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. వెంటనే ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ ఉందన్న ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామన్నారు. ఆరునెలలైనా ఇంకా ఎందుకివ్వలేదు? 25 వేల పోస్టులతో ఇస్తామన్న డీఎస్సీ 11 వేల పోస్టులతో ఎందుకు ఇచ్చారు. మొత్తం 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి. 

నిన్నమొన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చింది. పాత బకాయిలను కూడా కలిపి ఇస్తోంది. ఇక్కడ ఆరు నెలలైనా ఎందుకు 4 వేల రూపాయల పింఛన్ ఇవ్వడం లేదని హరీష్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చే పింఛన్ కూడా ఎందుకివ్వడం లేదని నిలదీశారు. "ఇంటికి 2 పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలు చేయడం లేదు. పేదల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం? ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి. ఒక్కొక్కరికి 12 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఈ నెలకు కలిపి మొత్తం 16 వేలు ఇవ్వాలి."
"ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం మాట తప్పింది. ఎన్ హెచ్ఎం, ఆశావర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య వర్కర్లకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. సొంత ఖర్చులతో డీజిల్ పోయించుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్‌‌కు సంబంధించి 65 వేల చెక్కులు

ఆంధ్ర ప్రదేశ్ లో చెప్పినట్లుగా 4వేలకు పింఛన్లు పెంచారు. మొదటి సంతకం పెట్టారు

రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైంది. ఏపీని చూసైనా నేర్చుకోవాలి. 4వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలి

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/mI9QyLiz2M

June 17, 2024 బొమ్మ ఉందనే కారణంతో పంపిణీ చేయడం లేదు. 

బీజేపీ హయాంలో సంపద కొందరి చేతుల్లోకి వెళ్లినట్టే విద్య కూడా కొందరి చేతుల్లో వెళ్తోందన్నారు హరీష్‌. "నీట్‌ నిర్వహణతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. గ్రేస్ మార్కులు, పేపర్ లేకేజీ ఆందోళన కలిగిస్తున్నాయి. 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుంది? ఒకే సెంటర్‌లో రాసిన ఆరుగురికి 720 మార్కులెలా వచ్చాయి? గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది పేర్లు, క్రైటీరియా బయటపెట్టాలి. నీట్‌లో గ్రేస్ మార్కుల విధానమే లేనప్పుడు ఎలా కలిపారు?  ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి, పార్లమెంటు ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారు? ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదు? పేపర్ లీక్ కాకపోతే బిహార్, గుజరాత్‌లో ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి? తెలుగు విద్యార్థులకు అన్యాయం జరక్కుండా బీజేపీ ఎంపీలు, మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి. ఇంత ప్రధాన సమస్యమై మీరెందుకు మాట్లాడ్డం లేదు? "

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Kompella Madhavi Latha: ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Kompella Madhavi Latha: ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Embed widget