అన్వేషించండి

KTR: మీ వేధింపుల్ని వడ్డీతో సహా చెల్లిస్తాం, మావాళ్లను కాపాడుకుంటాం - కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad News: పీర్జాదిగూడలో నిర్మాణాలను ప్రభుత్వం కూల్చి వేయించడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Telangana News: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేయించడం, దాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ‌ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని.. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామన్న బాధితులు అంటున్నట్లుగా కేటీఆర తెలిపారు. ఈ ప్లాట్లను బాధితులకు అమ్మింది కాంగ్రెస్ నాయకుడే అని తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎవరి కోసం ఇళ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

‘‘మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న  ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేయించండి. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి. లేదంటే ప్రజలు తిరగబడతారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు.

అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్ఓసీ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడు. 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్ కు మేలు చేయడం జరిగింది. కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోంది.

మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారు. మేము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేది. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్ ను, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget