క్రికెటర్ మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ- సాయంత్రం హీరో నితిన్‌తో సమావేశం
హన్మకొండ సభ కోసం హైదారాబాద్ వచ్చిన నడ్డా సెలబ్రెటీలతో భేటీలు షురూ చేశారు. ముందుగా మిథాలీతో సమావేశమయ్యారు.
హన్మకొండలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన నేరుగా నొవాటెల్ హోటల్‌కు వెళ్లారు.
నొవాటెల్‌కు చేరుకున్న జేపీ నడ్డా... క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంపై చాలా ఆసక్తి నెలకొంది. ఏం చర్చించారనే మాత్రం బయటకు రాలేదు. ఈ భేటీ తర్వాత హన్మకొండ సభకు వెళ్లనున్నారు. సాయంత్రానికి అక్కడి నుంచి తిరిగి వచ్చి హీరో నితిన్‌తో సమావేశంకానున్నారు.
Former cricketer Mithali Raj meets BJP National President JP Nadda in Hyderabad.@M_Raj03 | @JPNadda #MithaliRaj pic.twitter.com/Fe2I7dkDcW
— DD News (@DDNewslive) August 27, 2022
క్రికెటర్ మిథాలీ అప్పుడప్పుడు పీఎం సహా బీజేపీ ప్రముఖులు పెట్టిన పోస్టులను షేర్ చేస్తుంటారు. దేశానికి సంబంధించిన విషయాలపై ఆమె రియాక్ట్ అవుతుంటారు. కేంద్రం చేపట్టే చాలా పథకాలకు అనుకూలంగా రీట్వీట్ చేస్తుంటారు. దీంతో ఆమెతో నడ్డా భేటీకి రాజకీయాలకు ఎమైనా సంబంధం ఉందా అన్న కోణంలో తెలంగాణలో చర్చ నడుస్తోంది.
हमारी सरकार ने बच्चों और महिलाओं के स्वास्थ्य और पोषण को सर्वोच्च प्राथमिकता दी है। pic.twitter.com/a5TYez1DmN
— Narendra Modi (@narendramodi) June 10, 2022
మునుగోడు సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. జూనియర్ ఎన్టీఆర్‌ను పిలుచుకొని మాట్లాడటం హాట్‌టాపిక్ అయింది. ఇప్పటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ భేటీలో డిబేట్స్ నడుస్తున్నాయి. ఇంతలో మిథాలీ, నితిన్‌తో భేటీ అన్న విషయాన్ని ప్రజల ముంగిట పెట్టింది బీజేపీ.
ఈ భేటీల్లో ఏం చర్చిస్తున్నారు... వ్యూహమేంటన్నది మాత్రం మూడో చెవికి వినిపించడం లేదు. దీంతో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్‌షా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారని అభినందించడానికి కలుస్తున్నారని కవర్ చేశారు బీజేపీ నేతలు. కానీ ఈసారి మిథాలీ, నితిన్‌ను ఎందుకు కలుస్తున్నారంటే మాత్రం నో రిప్లై.
గతంలో కలిసిన ఎన్టీఆర్ రాజకీయా పార్టీలతో నేరుగా సంబంధం లేకపోయినా రాజకీయా కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఎక్కువ డిబేట్స్ నడిచాయి. ఈ సారి భేటీ అయ్యే మిథాలీ, నితిన్ ఇద్దరు కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కాబట్టి వీళ్లతో సమావేశంలో ఏం చరిస్తారనే అంశం ఆసక్తిగా మారింది.