Ashu Reddy Petition : హైకోర్టుకు అషు రెడ్డి - పోలీసులు వన్ సైడ్‌గా వ్యవహరించారా?
Ashu Reddy Reaction : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన FIR ను క్వాష్ చేయాలని కోర్టును కోరారు.

Ashu Reddy Petition In Telangana High Court To Quash FIR : బిగ్ బాస్ ఫేం, హీరోయిన్ అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కనీసం తన వెర్షన్ వినకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని... పోలీసుల తదుపరి చర్యలను అడ్డుకోవాలని ఆమె కోర్టును కోరారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు రానుంది.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ తన కుమారుడు ధర్మేంద్రను అషు రెడ్డి పెళ్లి పేరిట మోసం చేసిందంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన కొడుకు 2018లో భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బులు అడిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్లు, ఆస్తులు, బంగారం కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని... పెళ్లి పేరెత్తితే తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు.
దీంతో అషు రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈలోపే అషు రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణపై న్యాయస్థానం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read : చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ మూవీస్‌కు లీకుల షాక్ - ఐటమ్ సాంగ్ To యాక్షన్ సీక్వెన్స్!
రియాక్షన్... కాల్ మనీ లింక్
ఈ వివాదంపై అషు రెడ్డి స్పందిస్తూ... తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు, ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందించారు. తమ బిడ్డ అమాయకురాలని... సత్య నారాయణ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వారికి కాల్ మనీతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు.
పెళ్లి సంబంధం గురించి అడగ్గా... తన ఎంక్వైరీలో ధర్మేంద్రకు పెళ్లై విడాకుల కేసు నడుస్తోందని తెలిసిందని... సత్యనారాయణ ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తేలడంతో సంబంధం వద్దని నానుస్తూ వచ్చినట్లు చెప్పారు. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి తనకు ఏమీ తెలియదని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















