అన్వేషించండి

Revanth Reddy : వీహబ్‌లో రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అమెరికా సంస్థ

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఫలిస్తోంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.వీహబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా సంస్థ ముందుకొచ్చింది.

Revanth Reddy US Tour: గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చిన్నచిన్న మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమేగాక...వారికి శిక్షణ చేయూతనిస్తున్న  వీ హబ్‌(WE HUB)కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.తెలంగాణ(Telangana)కు పెట్టుబడుల సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) బృందం సమక్షంలో వీ హబ్‌లో పెట్టుబడులకు ఓ భారీ ఒప్పందం జరిగింది.

ఫలిస్తున్న తెలంగాణ సీఎం అమెరికా పర్యటన
తెలంగాణ(Telangana) ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy)...భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు.వివిధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ప్రవాసీయులతోనూ ఆయన సమావేశమయ్యారు. అమెరికా(America) సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి మాతృభూమి రుణం తీర్చుకోవాల్సిందిగా కోరారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

వీ హబ్ లో భారీ పెట్టుబడులు
మహిళా సాధికారతే లక్ష్యంగా, అతివలను ఆర్థికంగా తీర్చిదిద్దడమే గమ్యంగా సాగుతున్న తెలంగాణ వీహబ్‌(WeHub)లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.రూ. 42 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు  వాల్స్ కర్రా హోల్డింగ్స్ గ్రూప్  ఒప్పందం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో స్టార్టప్‌(Startup)లలో మొత్తం రూ. 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందు కుదిరింది. ఇందులో భాగంగా వీహబ్‌లో ఈ సంస్థ రూ.42 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 

Also Read: స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా - కీలక ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి

మాతృభూమి రుణం తీర్చుకుంటా
వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ కంపెనీని గ్రెగ్‌వాల్ష్‌, ఫణికర్రా నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఫణికర్రా..ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థి. తెలంగాణలో చదివి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తనకు మళ్లీ మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఫణి అన్నారు. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న వీహబ్‌లో పెట్టుబడులు పెట్టదం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. తమ పెట్టుబడులు వీహబ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వాల్స్‌ కర్రా హోల్డింగ్స్‌ సంస్థ అమెరికా, సింగపూర్‌లో విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో గ్రెస్‌వాల్ష్‌, ఫణి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లు, స్థిర లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతిచ్చి పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ కంపెనీ ప్రతినిధులు, వీహబ్‌ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందం చేసుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధితో సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వీహబ్‌లో పెట్టుబడులు పెట్టినందుకు సంస్థ ప్రతినిధులను అభినందించారు.

అమెరికాలో అత్యున్నత సంస్థల్లో తెలుగువారు కీలక స్థానాల్లో పనిచేస్తున్నారని...వారంతా మాతృభూమిలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. పుట్టినభూమి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని...ఆయన సూచించారు. సొంతఊరికి సాయం చేస్తే వచ్చే ఆత్మ సంతృప్తి మరి ఎందులోనూ రాదన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల వల్ల ఆయా సంస్థలకూ ఎంతో లాభం చేకూరుతుందన్నారు. కాబట్టి ప్రవాసులంతా ఈ దిశగా ఆలోచించాలన్నారు. వీహబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఫణికర్రాను ఆయన అభినందించారు.

Also Ready: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, అమెరికాలో సీఎం రేవంత్ ఒప్పందం - 15000 మందికి ఉద్యోగాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget