Hyderabad Cognizant Centre | హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, అమెరికాలో సీఎం రేవంత్ ఒప్పందం - 15000 మందికి ఉద్యోగాలు
Cognizant announces expansion of its Hyderabad facility | ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Cognizant to set up new facility in Hyderabad | హైదరాబాద్: ఐటి రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కంపెనీ కాగ్నిజెంట్ తెలంగాణ (Telangana)లో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు సంస్థ సోమవారం నాడు ప్రకటించింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇరవై వేల మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో కాగ్నిజెంట్ సంస్థ ఈ సెంటర్ ను స్థాపించనుంది.
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో కొత్త సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ నిర్ణయానికి పునాదులు పడ్డాయి. అద్భుతమైన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ (Hyderabad City) ఇతర రాష్ట్రాలతో పాటు పలు దేశాల సంస్థల్ని సైతం ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్నగరంలో తమ కంపెనీ విస్తరణకు నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్
కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నగరంలో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు వినియోగిస్తామం అన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను తమ సెంటర్ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence), మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన టెక్నాలజీపై ఈ కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు.
వేలాది యువతకు హైదరాబాద్ లో ఉద్యోగాలు
ఐటీ రంగానికి బెస్త్ వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ హైదరాబాద్ సిటీలో ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ నగరాన్ని తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీకి ప్రభుత్వ మద్దుతు ఎప్పటికీ ఉంటుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు హైదరాబాద్ లో ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని రేవంత్ సూచనకు కాగ్నిజెంట్ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు ఫోకస్ చేస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ మరింత డెవలప్ కావడానికి దోహదపడుతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
Also Read: Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా - కీలక ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి