Actress Madhavi Latha: కాపులపై వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి సినీ నటి, బీజేపీ నేత మాధవీలత - ABP దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Madhavi Latha Interview: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే సినీ నటి మాధవీలత కాపులపై తీవ్ర విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైతం వరుస ఫిర్యాదులతో చర్యలకు డిమాండ్ చేస్తున్న మాధవీలతతో ఇంటర్వ్యూ..

ABP Desam Exclusive Interview With BJP Leader Madhavi Latha:
ABP దేశం: జేసీ ప్రభాకర్ రెడ్డితో మీ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీరు ఫిల్మ్ ఛాంబర్, సైబరాబాద్ కమిషనర్‌కు తాాజాగా ఫిర్యాదులు చేశారు. ఎందుకు తెగేదాకా లాగుతున్నారు..?
మాధవీలత: నా విషయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆ తరువాత నాపై సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు, అసభ్యకర పోస్టులపై సైబరాబాద్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాను. ఫిర్యాాదులో అన్ని విషయాలు స్పష్టంగా తెలియజేశాను. జేసీ మద్దతుదారులు నా తల్లిదండ్రులను బెదిరించిన విషయాన్ని కమిషనర్‌కు చెప్పాను. నా వరకూ నేను ఏదైనా ఎదుర్కోగలగుతాను. కానీ నా తల్లిదండ్రులను సైతం బెదిరించడం నాకు బాధ కలిగించింది. నా తల్లిదండ్రులు విపరీతంగా ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికీ అదే పరిస్దితి ఉంది. నా కోసం నేనే ధైర్యంగా పోరాడలేకపోతే, ఇతరలను ఎలా ప్రశ్నించగలుగుతాను అనే ఆలోచన నన్ను మార్చింది. అందుకే ఫిల్మ్ ఛాంబర్, ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్‌కు జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాను. జేసీ కార్యకర్తలు సైతం అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ నాకు నచ్చలేదు.
ABP దేశం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం తరువాత మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా..? వస్తే ఎవరు బెదిరించారు. ఏమన్నారు..?
మాధవీలత: ఇప్పుడు సోషల్ మీడియా ఇంత వేగంగా విస్తరించి ఉంది. ప్రజలు చాలా స్మార్ట్ అయ్యారు. ఎవరూ నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తే దొరికిపోతామని కాల్స్ చేయకుండా సోషల్ మీడియా వేదికగా దారుణంగా నన్ను తిడుతున్నారు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, చర్మం వలిచేస్తాం. నువ్వు బ్రతకడానికేనా.. మా ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టు నీ సంగతి చూస్తాం. పెద్దోళ్లనే వదిలేశాం. నువ్వెంత ఆఫ్ట్రాల్, నిన్ను మేము లెక్క చేయము అంటూ ఆయన అనుచరులు మాట్లడుతున్నారు. ఇవన్నీ చూశాక, ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నాకు రక్షణ కల్పించాలని సీపీని కోరాను. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా నాకు మద్దతు వచ్చింది. నేను ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి నాపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ABP దేశం: మీ వాట్సస్ స్టేటస్‌లో కాపులను అభ్యంతరకర పదజాలంతో, తీవ్రంగా విమర్శించారు. కాపులంటే మీకు ఎందుకంత పగ..?
మాధవీలత: అది నా వ్యక్తిగత పోస్ట్, దాన్ని బహిర్గతం చేయాలని నేను అనుకోవడం లేదు. కాపులపై నాకు కోపం రావడానికి చాలా కారణాలున్నాయి. నేనూ కాపు అమ్మాయినే. ఇటీవల కాపు సంఘం నుంచి ఒకరు ఫోన్ చేసి నన్ను కాపు సంఘం సమావేశానికి ఆహ్వానించారు. అప్పడు జేసీ విషయం ప్రస్తావిస్తే, వాడు కుక్క వాడ్ని వదిలేయ్ అన్నారు. నాకు మద్దతుగా నిలుస్తామని మాత్రం కాపు సంఘం నేతలు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వాళ్లు సంఘం వార్షికోత్సవాలు చేసుకోవడానికి మాత్రమే నన్ను గుర్తు చేసుకునే వాళ్ల తీరు నాకు నచ్చలేదు. అందుకే కాపులను విమర్శించాను. నేను విజయాలు సాధిస్తే వాళ్లకు కావాలి. అదే నేను కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. జేసీ విషయంలోనూ అదే జరగడం జీర్ణించుకోలేకపోయాను. కులం పేరు పెట్టుకుంటే సరిపోదు. నిలబడాలి.
ABP దేశం: మీరు బీజేపీ నేతగా ఉన్నారు. ఒక మహిళా నేతపై జేసీ దారుణంగా వ్యాఖ్యలు చేస్తే, బీజేపీ ఎందుకు స్పందించలేదు. మీరు సింగిల్‌గా పోరాడుతున్నారే తప్ప బీజేపీ పట్టించుకోవడం లేదు ఎందుకని.?
మాధవీలత: నా విషయంలో మాత్రమే కాదు. పార్టీ ఎవరి విషయంలోనూ అంతగా పట్టించుకోదు. మీరు పోరాటం చేయండి మీకు మద్దతుగా వెనుక నుంచి మేము చేయాల్సింది చేస్తాం అంటారు. ఇది బీజేపీ సర్వసాధారణం. నేను ఈ ఘటన తరువాత ఏ మాత్రం వెనక్కు తగ్గబోను. రాబోయే రోజుల్లో అనేక సామాజిక అంశాలపై నా శైలిలో నేను మాట్లడి తీరుతాను. జేసీ విషయంలోనూ న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాను.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

