MLA Kolikapudi Srinivas Controversy | ఉద్యమ నేతలు రాజకీయాల్లో రాణించలేరా...కొలికపూడి కాంట్రవర్సీ ఏంటీ?
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని తన దగ్గర నుంచి ఐదు కోట్లు వసూలు చేశారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి చేసిన ఆరోపణలు ఉమ్మడి కృష్ణా రాజకీయాలను వేడెక్కించాయి. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవటం, వీరిపై అధిష్ఠానం సీరియస్ అవ్వటం గంటల్లో జరిగిపోయాయి. అయితే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ గ్యాప్ ను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కానున్నారన్న అనేంత వరకూ ఇష్యూను తీసుకువెళ్లారు. అసలు కొలికపూడి వర్సెస్ కేశినేని ఎపిసోడ్ లో ఏం జరిగింది. ఎందుకు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వైరం ఏర్పడింది. ఈ గొడవలు, వివాదాలపై అసలు టీడీపీ అధిష్ఠానం ఏమని అనుకుంటోంది అసలు కాంట్రవర్సీ ఏంటీ ఈ వీడియోలో చూసేయండి.





















