Kaushik Reddy Latest News: మరో వివాదంలో కౌశిక్ రెడ్డి- ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు- ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్
Kaushik Reddy Issue: పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసున నమోదు అయింది. దీనిపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది.
Padi Kaushik Reddy Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఓ ఎస్సై విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో ఇరుక్కున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జరుగుతున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తోంది.
తన ఫోన్‌ను ట్యాప్ చేసి సీఎం, ఇంటిలిజెన్స్ ఐజీ సంభాషణలు వింటున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందు కౌశిక్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న ఏసీపీ, సిఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తన ఫిర్యాదు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇలా మొదలైన వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులకు దిగారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఏ 1గా పేర్కొన్నారు. ఆయనతోపాటు20 మంది అనుచరులపై కూడా కేసులు కట్టారు.
ఈ కేసు నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుోతంది. అందుకే ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఉదయాన్ని పెద్ద సంఖ్యలో బలగాలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
ఈ కేసుపై కౌశిక్ రెడ్డి బుధవారమే స్పందించారు. తాను ఎవర్నీ బెదిరించ లేదని అన్నారు.తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మాత్రమే ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్‌పై కేసు పెట్టారని ఎమ్మెల్యేగా తాను ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ సరిగా సమాధానం చెప్పలేదన్నారు. సమాధానం సరిగా చెప్పకపోవడమే కాకుండా అతి చేశారని మండిపడ్డారు.
తాము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవడానికి సమయం ఇచ్చి కూడా ఏసీపీ లేరని అన్నారు. ఆ ఫిర్యాదు తీసుకోవడానికి సీఐ నిరాకరించారని అందుకే నిలదీయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని పోలీసులు డ్యూటీలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌తోపాటు బీఆర్‌్ఎస్ కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి.
ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోగా ఆయనపైనే ఉల్టా కేసు బనాయిస్తరు అని మండిపడ్డారు. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే... ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదని చెప్పుకొచ్చారు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటం అన్నారు.
ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే @KaushikReddyBRS గారి పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024
ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?
ఇదేం విడ్డూరం.
ఇదెక్కడి న్యాయం?…