Telangana RTC: సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ సిబ్బంది- సీఎం, ఎండీ ప్రశంసంలు
TSRTC Staff: మొన్న కరీంనగర్, నిన్న నాగర్‌కర్నూల్ రెండు రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కాపాడారు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది. దీనిపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
TSRTC MD Sajjanar: 14 ఏళ్ల బాలికను కాపాడారు, గర్భిణీకి డెలవరీ చేశారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుతున్న తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది ప్రశంసలు అందుకుంటోంది.
సమయస్ఫూర్తి ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడేలా చేస్తుంది. ఇలాంటి సమయ స్ఫూర్తితోనే రెండు రోజుల్లో రెండు నిండు ప్రాణాలు కాపాడారు ఆర్టీసీ సిబ్బంది. అందుకే ఆర్టీసీ సిబ్బంది మానవత్వానికి, సమయస్ఫూర్తిని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలానికి చెందిన బాలిక ఆర్టీసీలో వెళ్తుండగా అస్వస్థతు గురయ్యాు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది నేరుగా బస్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ బాలికను కాపాడారు.
పూజశ్రీ తమ్ముడు లింగాలలోని రెసిడెన్స్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. అమ్మతో కలిసి తమ్ముడిని చూడటానికి వెళ్తుండగా లింగాల సమీపంలో అస్వస్థతకు గురైందా బాలిక. ఆమెకు ఫిట్స్ వచ్చిందని గ్రహించిన ఆర్టీసీ డ్రైవర్ అర్జున్ ఆలస్యం చేయకుండా బస్‌ను లింగాల ప్రభుత్వాసుపత్రికి పోనిచ్చాడు. దీనికి బస్‌లో ఉన్న ప్రయాణికులు కూడా అభ్యంతరం చెప్పలేదు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పాపకు ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక ఐవోల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. పూజశ్రీని రక్షించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను ప్రయాణికులు అభినంధించారు.
మానవతామూర్తులు.. మన ఆర్టీసీ ఉద్యోగులు!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 18, 2024
ఫిట్స్ తో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలిని బస్సులో నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం అందించిన #TGSRTC సిబ్బందికి అభినందనలు.
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో మేమున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగులు సేవాతర్పరత… pic.twitter.com/5OlnYxEFUL
మొన్న ఓ ఆర్టీసీ బస్‌లో మహిళ డెలవరీ అయ్యింది. ఇందులో కూడా ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తిని చాటుకున్నారు. ఒడిశా వాసి కుమారి భర్తతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో ఉంటున్నారు. అక్కడే స్థానికంగా ఉండే ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కుంట వెళ్లేందుకు కుమారి బస్ ఎక్కేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. గర్భిణీ అయిన కుమారికి అక్కడే నొప్పులు ప్రారంభమయ్యాయి. భర్తకు ఏం చేయాలో కాళ్లు ఆడలేదు. దీంతో ఆర్టీసీ సిబ్బంది సాయం కోరారు. ఆమె పరిస్థితి గమనించిన ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్లు సాయం కోసం ముందుకొచ్చారు. చీరలను అడ్డం పెట్టి ప్రసవం చేశారు. పుట్టిన ఆడపిల్ల క్షేమంగా ఉంది. ఇంతలో 108 అంబులెన్స్ రాగానే తల్లీపిల్లను ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్‌లో గర్భిణీకి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందిని అంతా అభినందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీఎం రేవంత్ రెడ్డి వారిని ప్రశంసించారు.
పరిమళించిన మానవత్వం!!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 17, 2024
కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికి కాన్పు చేసిన #TGSRTC మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయం. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ మేం ముందు ఉంటామని… pic.twitter.com/0TjCrFw3KI
కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న తెలంగాణ ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కితాబు ఇచ్చారు.
కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2024
విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. pic.twitter.com/T68rF40q69