By: ABP Desam | Updated at : 01 Jul 2022 02:50 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman On BJP : తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక్క మంచిపనైనా తెలంగాణకు కేంద్రం నుంచి చేయించడం కిషన్ రెడ్డికి చేతకాలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక దొంగలముఠా అని తీవ్ర విమర్శలు చేశారు.
వసూళ్ల పర్వం
జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో బీజేపీ నాయకులు వసూళ్లకు దిగారు. దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బీజేపీ అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడుతాం. పార్లమెంట్ సాక్షిగా వసూళ్ల దందాను నిలదిస్తాం. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. బీజేపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారు. - ఎమ్మెల్యే బాల్క సుమన్
జాతీయ హోదాపై
తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తే, బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలను కూడా మంజూరు చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ పై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి తెలంగాణను మోసం చేశారని బాల్క సుమన్ మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను కూడా కేంద్రం అమలుచేయలేదని ఆరోపించారు. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
Also Read : BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్ డౌన్’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు
Also Read: BJP TRS Flexi Fight : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్, ప్రధాని పర్యటన వేళ ముదిరిన వివాదం
పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు
KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !
Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !
RajBhavan Vs Pragati Bhavan : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ! కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!