By: ABP Desam | Updated at : 01 Jul 2022 08:28 AM (IST)
కొండగట్టులో మళ్లీ ప్రారంభం అయిన ఘాట్ రోడ్డు
Jagtial Kondagattu Ghat Road Reopens : ఉమ్మడి కరీంనగర్ జిల్లా (జగిత్యాల)లోని కొండగట్టు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దాదాపు నాలుగేళ్ల కిందట.. 2018 సెప్టెంబర్ 11వ తేదీన ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లడంతో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పెను సంచలనంగా మారిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. అక్కడికక్కడే 24 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 41 మంది చనిపోయారు. క్షతగాత్రులు సైతం అదే స్థాయిలో ఉండడంతో అప్పటి ప్రభుత్వం వెంటనే కొండగట్టుకు వెళ్లే ఘాట్ రోడ్డు దారిని మూసివేసింది.
విషాదం జరిగిన దాదాపు నాలుగేళ్లకు రీఓపెన్..
2018లో ప్రమాదం జరగగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి ఆ దారిని తెరవడానికి ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు జూన్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఘాట్ రోడ్డు చుట్టూ రక్షణ కోసం తగిన మందంతో కూడిన గోడలను కట్టామని... ఇక పాత దారిలోనే బైక్ లు, కార్లు ఇతర చిన్న వాహనాలు వెళ్లడానికి అనుమతినిచ్చింది. అయితే పెద్ద వాహనాలకు మాత్రం ఇప్పటికీ అనుమతి రాలేదు. ప్రధానంగా ఈ దారి ఆలయానికి దగ్గరగా వెళ్లడానికి దగ్గరగా అవుతోంది. దీనివల్ల ఈ దారిలోనే ఎక్కువగా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. చిన్న చిన్న షెడ్ ల లాంటి వాటిల్లో కూడా లక్షల్లో బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
అప్పట్లో రోడ్ సేఫ్టీ అథారిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అర్ అండ్ బీ ఆఫీసర్లు సంయుక్తంగా విచారణ జరిపారు.. కింది వైపు వెళ్లే ఘాట్ రోడ్డు వాలుగా ఉండడంతో హెవీ వెహికల్స్ ప్రయాణానికి అనువుగా లేదని నిర్ధారణకు వచ్చి రోడ్డును మూసివేసి ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డు పక్కనే అన్ని జాగ్రత్తలతో మరో ఘాట్ రోడ్డు నిర్మించేలా ప్లాన్స్ వేశారు. ఈ మేరకు బడ్జెట్ రూ. 134 కోట్లు అవుతాయని అంచనా వేసి మూడేళ్లు గడిచినా ఈ దిశగా అడుగులు పడలేదు. పాత ఘాట్‌రోడ్డు దేవస్థానం మెట్లదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరం ఉంది. గుట్ట కింద నుంచి దేవస్థానానికి అరగంట లోపే చేరుకునేవారు.
2018లో ప్రమాదం జరిగాక ఘాట్ రోడ్డును మూసి వేయడంతో భక్తులు గుట్ట కింద నుంచి దొంగలమర్రి మీదుగా జేఎన్టీయూ కాలేజ్ రూట్ లో 8 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం పాత ఘాట్ రోడ్డును దిగేందుకు కాకుండా కేవలం పైకి టు వీలర్స్, కార్లు ఎక్కేందుకు మాత్రమే తాత్కాలికంగా పర్మిషన్ఇచ్చారు. వీటికి సైతం ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా రూ. 40 లక్షలు ఖర్చు చేసి ఐదు చోట్ల సైడ్ వాల్స్ నిర్మించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దారిలో వెహికల్స్ఎక్కడంతోపాటు దిగేందుకు సైతం పర్మిషన్ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల భక్తులు జంకుతున్నారు. వాస్తవికతను మరిచి మళ్ళీ అదే దారిలో సరైన రక్షణ చర్యలు లేకుండా ప్రయాణం చేయడం సురక్షితం కాదనే భయపడుతున్నారు. కొండగట్టు ఘాట్‌రోడ్డుపై వాహనాల రాకపోకలు ప్రారంభం కానుండటంతో కొందరు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
Also Read: BJP Leaders In TRS : బీజేపీకి ముందుగానే షాక్ - నలుగురు హైదరాబాద్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కండువా !
దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ
BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్లో బీజేపీ వ్యూహం ఫలించేనా?
Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా
ఖమ్మం జిల్లాలో తుమ్మల అనుచరుడి దారుణ హత్య- వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?