అన్వేషించండి

Kumaraswamy Meets CM KCR : సీఎం కేసీఆర్ తో కుమారస్వామి భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

Kumaraswamy Meets CM KCR : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు.

Kumaraswamy Meets CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ముందుగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కుమారస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  మంత్రి కేటీఆర్ తో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటితో పాటు జాతీయ రాజకీయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు కుమారస్వామి తెలిపారు. ఆ భేటీ అనంతం కుమారస్వామి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.    

సీఎం కేసీఆర్ తో కుమారస్వామి భేటీ 

జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉండబోతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో కుమారస్వామితో భేటీ కీలకంగా మారింది.  కేసీఆర్‌ పెట్టబోయే జాతీయపార్టీపై ఆయనతో చర్చించినట్లు సమాచారం.  కుమారస్వామి ప్రగతిభవన్ కు చేరుకోవడానికి ముందు ఓ హోటల్ లో కుమారస్వామితో  మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి సమావేశం అయ్యారు.  దేశంలో తాజా రాజకీయాలతో  ఈ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానాలు కూడా చేస్తున్నాయి. కేంద్రంతో పోరాడాలంటే జాతీయ పార్టీ తప్పనిసరి భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2024లో కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ముందు అనేక ప్రతికూలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఉత్తరాది ప్రజలకు తెలియకపోవడం దగ్గర్నుంచి  తెలంగాణ పేరుతో ప్రాంతీయ ఉద్యమం నడిపి ఇప్పుడు దేశం మొత్తం రాజకీయం చేస్తాననే భావజాలం వరకూ అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయినా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకం అని అనుకోవచ్చు. 

రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులకు అందని నేత కేసీఆర్ !

 తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అందని రాజకీయం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు.  కానీ ఓ ప్రాంతీయ పార్టీ నేత . అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికే టీఆర్ఎస్ పేరుతో కాకుండా జాతీయ పార్టీని ఆయన పెడుతున్నారు. అంటే తెలంగాణ ఇమేజ్‌ను వదిలి నేషనల్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

Also Read : KCR National Party : అన్నీ ప్రతికూలతలే - ఢిల్లీకి గురి పెట్టిన కేసీఆర్ నమ్మకమేంటి ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget