By: ABP Desam | Updated at : 24 Feb 2023 10:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైద్య విద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
Errabelli On Preethi Health : పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరో వైపు వరంగల్ సీపీ రంగ నాథ్ తో మాట్లాడి ఈ ఘటనపై తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంకోవైపు ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి ఓదార్చారు. వ్యక్తిగతంగా తాను, ప్రభుత్వం అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రీతికి మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రీతి తల్లిదండ్రులు శారద (రైల్వే లో ఏఎస్ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో వైద్యులను కలిపి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రీతి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కుటుంబ సభ్యులకు ఉన్న సందేహాలను నిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడించి నివృత్తి చేశారు. జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
దోషులని తేలితే వదిలేప్రసక్తే లేదు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలను ఖండించాలి. ప్రీతి కుటుంబం నా పాలకుర్తి నియోజవర్గానికి చెందినది. చాలా కాలంగా ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఉండే ఫ్యామిలీ. ప్రీతి నిప్పులాంటి అమ్మాయి. ఆమెను వేధించిన వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చి తిప్పి కొట్టింది. వేధింపుల వల్లే మానసిక వేధనకు గురైనట్లుగా అనిపిస్తుంది. పోలీస్ విచారణ జరుగుతుంది. దోషులు అని తేలితే, ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదు. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని మంత్రి చెప్పారు. ఇక కొందరు అతి సున్నితమైన ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ప్రీతి బతకాలి. న్యాయం జరగాలి. దోషులకు శిక్ష పడాలి. అని బాధిత కుటుంబం కోరుతుంది. ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.
సైఫ్ అరెస్ట్
వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అందుకు కారణంగా భావిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. విచారణ చేసిన మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు ఛాటింగ్‌లో కొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. పోలీసులు సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. .
సైఫ్ కి 14 రోజుల రిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సైఫ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సైఫ్ ను ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్