Revanth Reddy: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందంచడంలేదు : రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై సభలో మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అడ్డుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత అవమానకరంగా మాట్లాడారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో తెలంగాణపై మాట్లాడుతున్నప్పుడు టీఆరెస్ ఎంపీలు కనీసం అడ్డుతగల్లేదని విమర్శించారు. ప్రధాని ప్రసంగానికి నిరసన తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేస్తే టీఆరెస్ ఎంపీలు మద్దతు తెలుపలేదన్నారు. మోదీ ప్రసంగంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించామన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటును అవమానిస్తే ఎందుకు స్పందించడంలేదన్నారు. టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో రేబాన్ కళ్ల అద్దాలు పెట్టుకోని వచ్చారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మోదీ దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబం మోదీకి దళారులుగా మారారని, దందాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక్ష ధర్నాలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన బీజేపీకి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా అని రేవంత్ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మోదీని ఇక్కడ అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జనగామలో మోదీ వ్యాఖ్యలపై స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ సభలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ, ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను అవమానించిన బీజేపీకి ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆ జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్
'దామోదరం సంజీవయ్య ఎన్ని ఉన్నత పదవులు అనుభవించినా ఎంతో నిజాయితీగా పనిచేశారు. ఆయన చనిపోయినప్పుడు స్వంత ఇల్లు లేదు. సామాజిక న్యాయం కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలియాలి. దామోదరం సంజీవయ్య సెంచరీ సెలబ్రేషన్స్ చేయాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశాను. కానీ సీఎం కేసీఆర్ దీనిపై స్పందించలేదు. దళితులపై కేసీఆర్ కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎందుకు దామోదరం సంజీవయ్యను మరిచారు. సీఎం కేసీఆర్ అంబేడ్కర్ ను అవమానిచారు. ఆయన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దామోదరం సంజీవయ్య వంద సంవత్సరాల సెలబ్రేషన్స్ కాంగ్రెస్ తరుపున చేస్తున్నాం. ఆంధ్రలో కర్నూల్ జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి. సీఎం జగన్ కు దీనిపై లేఖ రాశాను.' అని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.
Also Read: ఎప్పుడన్న అనుకున్నమా ఇట్ల జరుగుతదని: సీఎం, కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు