News
News
X

Vinod Kumar On BJP : తెలంగాణకు రైల్వే లైన్ల మంజూరులో తీరని అన్యాయం, రూ.10 కోట్లు ఏ మూలకు సరిపోతాయ్ - వినోద్ కుమార్

Vinod Kumar On BJP : రైల్వే లైన్ల మంజూరులో బడ్జె్ట్ లో కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని వినోద్ కుమార్ ఆరోపించారు.

FOLLOW US: 
Share:

Vinod Kumar On BJP : తెలంగాణకు రైల్వే లైన్ల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. కొత్త రైల్వే లైనులు ఇవ్వకుండా, రైల్వే లైన్లకు తగినన్ని నిధులు కేటాయించకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన నగరాలకు బుల్లెట్ రైలు ప్రస్తావన లేకుండా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేకుండా, కాజీపేట వ్యాగన్ వర్క్ షాప్ ఏర్పాటులో ఎంత భూసేకరణ అవసరం, ఎంతమందికి కొత్త ఉద్యోగాలు ఇస్తారో?, ఎన్ని నిధులు మంజూరు చేయనున్నారో? స్పష్టత ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసిందని ఆరోపించారు. రైల్వే అంశంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చీకట్లో పెట్టేసిందని బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. 

రూ.10 కోట్లు మాత్రమే 

కాజీపేట వ్యాగన్ల తయారీ కేంద్రం కోసం ఎంత భూసేకరణ అవసరం ఉందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే అందుకు అవసరమైన భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వినోద్ కుమార్ తెలిపారు. అయితే వ్యాగన్ల తయారీ కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వనుందో స్పష్టం చేయాలని, ఎంత మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్నారో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం హైదరాబాదులో ఉన్నందున.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని వినోద్ కుమార్ కోరారు. రామగుండం- మణుగూరు రైల్వే లైన్ పనులను విధించి పూర్తి చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పనుల కోసం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది ఏ మూలకు కూడా సరిపోదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. 

తెలంగాణకు అన్యాయం 

రామగుండం - మణుగూరు రైల్వే లైన్ పనులు పూర్తయితే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అత్యంత కీలకమైన ఈ రైల్వే లైన్ పనులను దశాబ్ద కాలం నుంచి సాగదీస్తున్నారని అంటూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరిని వినోద్ కుమార్ తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల ప్రస్తావనే లేకుండా పోయిందని, ఆన్ గోయింగ్ రైల్వే లైన్లకు తగినన్ని నిధులు ప్రకటించలేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్-ఆర్మూర్-నిర్మల్- ఆదిలాబాద్ రైల్వే లైన్ ఊసే లేకుండా పోయిందని అన్నారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మధ్య మూడో రైల్వే లైన్ కోసం మాత్రమే నిధులు కేటాయించారని అయితే ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ కు కేటాయించినట్లు ఎలా అవుతుందని వినోద్ కుమార్ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కొచ్చిలకు బుల్లెట్ రైలు ప్రస్తావనను కేంద్రం చేయనేలేదని వినోద్ కుమార్ మండిపడ్డారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై వివక్షత 

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వలేమంటూ చెబుతూనే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రులు వారి రాష్ట్రాల్లో కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేసుకుంటున్నారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పట్ల వివక్షత చూపుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.

Published at : 04 Feb 2023 05:55 PM (IST) Tags: BJP Hyderabad Vinod Kumar Union Budget BRS Telangana Railway Budget

సంబంధిత కథనాలు

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

Mlc Kavitha : నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha :  నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

టాప్ స్టోరీస్

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్