BJP Poster : టీఆర్ఎస్ పాలనపై బీజేపీ వినూత్న ప్రచారం, "ఆ ఒక్కటీ అడక్కు" పోస్టర్ విడుదల
BJP Poster : కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బీజేపీ వినూత్న ప్రచారం చేపట్టింది. ఆ ఒక్కటీ అడక్కు అంటూ పోస్టర్ విడుదల చేసింది.
BJP Poster : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ పోస్టర్లను విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ పోస్టర్ విడుదల చేశారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను సోషల్ మీడియా అన్నీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు.
మాకు గురువంటే దైవంతో సమానం. వాళ్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాం. చెప్పులు అందించాను. అందులో తప్పేముంది? మీ అయ్య ఆయన గురువు జయశంకర్ సార్ ను కొట్టిండు. కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించినడు. అయినా అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. ముందు మీ నోరు సంప్రోక్షణ చేయాలి.
— BJP Telangana (@BJP4Telangana) October 29, 2022
-శ్రీ @bandisanjay_bjp pic.twitter.com/Uvcr6KZihB
• చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ఆకుపచ్చ మునుగోడును చేస్తా
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• రైతులకు ఉచిత ఎరువులు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• దళిత ముఖ్యమంత్రి
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ఇంటికో ఉద్యోగం
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• నిరుద్యోగభృతి
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ఫీజు రీయంబర్స్‌మెంట్
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ఎంబీసీలకు ప్రతీ బడ్జెట్‌లో వెయ్యికోట్లు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనులు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• కొత్త ఆసరాఫించన్లు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• బీసీలకు ఆత్మగౌరవ భవనాలు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు
కేసీఆర్ - ఆ ఒక్కటీ అడక్కు
• కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్
కేసీఆర్ - ఆ-ఒక్కటీ అడక్కు
Also Read : KTR BJP Chargesheet : అన్ని వర్గాలనూ మోసం చేసిన బీజేపీ - చార్జ్‌షీట్ విడుదల చేసిన కేటీఆర్ !