(Source: ECI/ABP News/ABP Majha)
Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్
Garikapati Narsimharao : అలయ్ బలయ్ లో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. అయితే గరికపాటికి మెగా బ్రదర్ కౌంటర్ ఇచ్చారు.
Garikapati Narsimharao : మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి, ప్రముఖ హీరో చిరంజీవి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో గరికపాటి మాట్లాడేందుకు మైక్ తీసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవితో స్టేజ్ పై ఉన్న మహిళలు, యువతులు ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. చిరంజీవి వారితో ఫొటోలు దిగుతున్నారు. అందరూ చిరంజీవి వైపు చూస్తుండడంతో గరికపాటి అసహనానికి గురై అయ్యారు.
గరికపాటి ఆగ్రహం
అలయ్ బలయ్ వేదికపై మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి స్పీచ్ ప్రారంభిస్తున్నప్పుడు చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగుతున్నారు. దీంతో గరికపాటి ఆగ్రహంతో ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా నాకు సెలవిప్పించండి అంటూ గట్టిగానే అన్నారు. దీంతో నిర్వాహకులు గరికపాటికి సర్దిచెప్పారు. కాసేపటికి చిరంజీవి రావడంతో గరికపాటి శాంతించారు. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వద్దకు వచ్చి ఆయనను పలకరించారు. గరికపాటి పక్కనే చిరు కూర్చొని ఆయన ప్రసంగాన్ని ఆలకించారు. ఈ సభలో అంతకు ముందు గరికపాటిని చిరంజీవి ప్రశంసించారు. త్వరలో తన ఇంటికి ఆయనను పిలుపుస్తానని తెలిపారు. ఆయనపై తన గౌరవాభిమానాల్ని చాటుకున్నారు.
చిరంజీవి ఎమోషనల్
తను రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఎన్నో విమర్శలు చేశారని.. వేలెత్తి చూపించారని చిరంజీవి అన్నారు. రక్తం అమ్ముకొని బతుకుతున్నాడని ఆరోపణలు చేశారని.. కానీ ఏరోజు కూడా వాటికి స్పందించలేదని అన్నారు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయని.. మాటకి లొంగని వాడు హృదయ స్పందనకి లొంగిపోతారని అన్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమ సారాన్ని ఆచరించమని చిరు కోరారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు, అభిమానుల మధ్య విద్వేషాలు రగులుతుండేవని.. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరోని టార్గెట్ చేస్తూ తిట్టడం, పోస్టర్స్ చింపడం వంటి పనులు చేసేవారని.. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నానని చిరు అన్నారు. అందుకే ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ తీసుకొచ్చానని.. తన సినిమాలు హిట్ అయినప్పుడు ఇండస్ట్రీకి చెందిన హీరోలను, తమిళ హీరోలను పిలిచి పార్టీ ఇచ్చేవాడినని అన్నారు. ఆ సమయంలో అందరం కలిసి మాట్లాడుకునేవాళ్లమని.. అలా హీరోల మధ్య ఈగోలు లేకుండా ప్రయత్నించేవాడినని చిరు తెలిపారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
మెగా బ్రదర్ కౌంటర్
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహారావుకు మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలకు హర్ట్ అయిన నాగబాబుఈ ట్వీట్ చేశారనే వార్తలు వస్తున్నాయి.
Also Read : Megastar Chiranjeevi: వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!
Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?