అన్వేషించండి

Telangana Movement: 'ద బిల్ ఈజ్ పాస్‌డ్' - ఈ మాట వెనుక అలుపెరుగని పోరాటం, ఎందరిదో త్యాగం!

Telangana Movement: ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ఆత్మ బలిదానాలు అన్నీ ఆ ఒక్క కల కోసమే. 2014 జూన్ 2న అది సాకారమైన వేళ ఆ ఉద్యమాల పోరాట స్ఫూర్తిని ఓసారి చూస్తే..!

Telangana Movement Key History: 'ద బిల్ ఈజ్ పాస్‌డ్'.. అవును ఈ మాట వింటే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి మనసు ఉప్పొంగుతుంది. ఎన్నో పోరాటాలు, ఎందరివో ఆత్మ బలిదానాలు, ఎన్నో ఉద్యమాలు, విద్యార్థుల నిరసనలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు. 'మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలి'.. అంటూ ఎందరో ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా.. తెలంగాణ ఆవిర్భావమే శ్వాసగా అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటులో ప్రతీ ఉద్యమం ఓ కీలక ఘట్టమే. తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో ఎన్నో ఘట్టాలు ఇప్పటికీ కొన్నిసార్లు కళ్లముందు కదలాడుతాయి. ప్రత్యేక రాష్ట్రం సాధన వెనుక ఉన్న ఆ పోరాట ఘట్టాలను ఓసారి గుర్తు చేసుకుంటే..!

ఓ ఒప్పందం.. ఓ ఉద్యమం

పెద్ద మనుషుల ఒప్పందం.. తెలుగు రాష్ట్రాలు కలవడానికి, విడిపోవడానికి కారణమైంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆఘమేఘాల మీద నాటి మద్రాస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని తరలించింది. ఆంధ్ర రాష్ట్రం ఎగువ భాగంలో ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉండడం, హైదరాబాద్ ద్వారా ప్రవహించే కృష్ణా, గోదావరి నదీ జలాల అందుబాటు వంటి కారణాలు.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును ప్రేరేపించాయి. దీన్ని చాలామంది తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకించారు. వారి భయాలు తొలగించేలా.. తెలంగాణ ప్రాంతానికి అనేక హామీలతో ఓ తీర్మానం.. పెద్ద మనుషుల ఒప్పందానికి దారి తీసింది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్‌లో జరిగిన భారత్ సేవక్ సమాజ్ సమావేశంలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. 

జై తెలంగాణ ఉద్యమం

అయితే, పెద్ద మనుషుల ఒప్పందంలోని పలు రక్షణల ఉల్లంఘనలు, ప్రాంతీయ వివక్షలతో 1969లో 'జై తెలంగాణ' ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో థర్మల్ విద్యుచ్చక్తి కేంద్రం (కేటీపీఎస్)లో తెలంగాణ ప్రజా పోరాటానికి అంకురార్పణ జరిగింది. ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు పాల్వంచ థర్మల్ విద్యుత్ కేంద్రంలో అన్యాయాలను వెలుగులోకి తెచ్చి ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులు, యువకులకు అవగాహన కల్పించారు. అప్పటి నిరసనల్లో ఎందరో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసు కాల్పుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను నిలువరించడం ఎవరి తరం కాలేదు. అప్పటి ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోయినా సమాజాన్ని చైతన్యపరిచింది.

తెలంగాణ వారిని సంతృప్తి పరచడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని సూచించారు. అటు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా 1972లో 'జై ఆంధ్ర ఉద్యమం' ప్రారంభమైంది. ఈ క్రమంలో 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకం రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీలోని అన్యాయానికి గురవుతున్నామనే అసంతృప్తి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలో 1990లో వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది.

ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా..

2001, ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఏర్పాటైంది. 'తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే గొంగళిపురుగును కూడా ముద్దాడుతాం' ఇది కేసీఆర్ అప్పటి ఫేమస్ డైలాగ్. మలి దశ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర సాధనం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో తెలంగాణ సకలజనులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎందరో ఉద్యమకారులు పోరాట ప్రతిఫలం ప్రత్యేక తెలంగాణ కళ సాకారమైంది. తన పదవులకు రాజీనామా చేసి 2001 సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సిద్ధిపేట నుంచి కేసీఆర్ గెలుపుతో.. ప్రత్యేక రాష్ట్రం సాధన వ్యూహానికి పునాది పడింది.

  • 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో వెళ్లి 26 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగం, యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో ఈ అంశాన్ని చేర్చారు. తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి.
  • అనంతరం కాంగ్రెస్ తనను మోసం చేసిందని 2009 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలో మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కేవలం 10 చోట్లే గెలిచారు. 2009 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్ మరణం తర్వాత.. అదే ఏడాది అక్టోబర్‌ 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.

నిరాహార దీక్ష - ఉద్యమంలో కీలక మలుపు

తెలంగాణ మలి దశ ఉద్యమానికి కీలక మలుపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. 2009 నవంబర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేసి నిమ్స్ తరలించినా అక్కడా దీక్ష కొనసాగించారు. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో' అనే నినాదంతో తెలంగాణ ఆందోళనలు, నిరసనలతో నిప్పులకొలిమిలా మారింది. దీంతో కేంద్ర దిగివచ్చింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసింది. 

సంబురాలు - నిరసనలు

కేంద్ర ప్రకటనతో తెలంగాణలో సంబురాలు మొదలుకాగా.. ఆంధ్ర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. రాజీనామాలు, నిరసనలతో హోరెత్తడంతో డిసెంబర్ 23న ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను కేంద్రం పక్కన పెట్టింది. ఉమ్మడి ఏపీ పరిణామాలపై అధ్యయానానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలు, సంస్థలు ఏకమై 'తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ'గా ఏర్పాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. నిరుద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగరహారం, సమరదీక్ష, ఛలో అసెంబ్లీ వంటి నిరసనలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక ఘట్టాలు.

  • తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యమకారులు 2011 ఫిబ్రవరి 17న ప్రారంభించి మార్చి 4 వరకూ 16 రోజుల పాటు సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ స్తంభింపచేశారు. ఉద్యోగుల పెన్ డౌన్, కార్మికుల టూల్ డౌన్, ఉపాధ్యాయుల చాక్ డౌన్ వాటితో పూర్తిగా స్తంభించిపోయింది.
  • 2011 మార్చి 10న కేసీఆర్ 'మిలియన్ మార్చ్'కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ దిగ్భందనానికి పిలుపునివ్వగా ఉద్యమం రాజకీయ నేతల చేతుల్లోనుంచి ప్రజల చేతుల్లోకి వెళ్లినట్లయింది. 
  • సకల జనుల సమ్మె - 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకూ 42 రోజులు నిర్వహించిన సమ్మెతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ అటెండర్ల దగ్గర నుంచి అధికారుల వరకూ అందరు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
  • 2012 సెప్టెంబర్ 30న హుస్సేన్ సాగర్ - నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ మార్చ్ నిర్వహించారు. ఆ తర్వాత సమరదీక్షతో ఉద్యమం మరో స్థాయికి వెళ్లింది.
  • 2013, జూన్ 13న 'ఛలో అసెంబ్లీ' పిలుపుతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ముందడుగు పడింది. ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించింది.

కల సాకారమైన వేళ

ఉద్యమాలు, ఎందరివో త్యాగాలు, పోరాటాలు, బలిదానాలు, నిరసనల తర్వాత పార్లమెంటులో 2014, ఫిబ్రవరిలో ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందింది. 'ద బిల్ ఈజ్ పాస్‌డ్' అంటూ పార్లమెంటులో ప్రకటన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి కల, ఆకాంక్ష కళ్ల ముందు కదలాడాయనే చెప్పాలి. అనంతరం జూన్ 2, 2014న హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ అధికారికంగా ఏర్పాటైంది. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సహా పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget