అన్వేషించండి

Harish Rao On KCR: కేసీఆర్‌ను తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే - నోటీసులపై భగ్గుమన్న హరీష్ రావు

Harish Rao: కేసీఆర్‌కు నోటీసులపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇలా చేయడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన హెచ్చరించారు.

Harish Rao strongly criticized the notices to KCR: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్  ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు  మండిపడ్డారు.  కేసీఆర్ ని తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు.  స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానేతపై బురద చల్లడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని, ఇలాంటి చౌకబారు రాజకీయాలను తెలంగాణ సమాజం హర్షించదని ఆయన మండిపడ్డారు.

సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం  సిట్' నోటీసుల డ్రామా ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. పరిపాలనా వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ విధమైన రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి దివాళాకోరు చర్యలకు దిగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

చరిత్రను సృష్టించిన కేసీఆర్ గారిని మలినం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డిని  చరిత్రహీనుడు గా హరీష్ రావు అభివర్ణించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్   వెనుక కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇలాంటి నోటీసులకు లేదా బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.         

 రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ వేధింపులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకుని, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలని డివైడ్ చేశారు. సిట్ నోటీసుల జారీ అనేది ముమ్మాటికీ రాజకీయ కుట్రలో భాగమేనని, దీనిని చట్టపరంగా, ప్రజాక్షేత్రంలోనూ ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు 

ఫోన్ ట్యాపింగ్  కేసులో సిట్ అధికారులు  CRPC 160 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి ముందు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌కు విచారణకు రావొచ్చని.. లేదా ఆయన వయసు రీత్యా ఆయనకు తగిన చోట విచారణకు హాజరు కావొచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో నోటీసులు అందజేశారు. కేసీఆర్ ఎక్కడ విచారణ కోరుకుంటున్నారో దర్యాప్తు అధికారికి తెలపాలని నోటీసుల్లో సూచించారు.                       


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget