Insta Reel : ప్రాణం మీదకు తెచ్చిన ఇన్ స్టా రీల్, వీడియో చేస్తుంటే ఢీకొట్టిన రైలు!
Insta Reel : ఇన్ స్టా రీల్ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వేగంగా వస్తు్న్న రైలు ముందు నడుస్తూ రీల్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు.
Insta Reel : సోషల్ మీడియా అందుబాటులోకి యువత వాటిల్లో యాక్టివ్ ఉంటూ నిత్యం ఏదొక వీడియో లేదా ఫొటో పోస్టు చేస్తుంటారు. అయితే కొంత మంది తమ వీడియోలకు ఎక్కువ వ్యూస్, లైక్స్ రావాలనే ఉద్దేశంతో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీడ్ గా వెళ్తున్న రైలు ముందు నడుస్తూ ఓ యువకుడు ఇన్ స్టా రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే అతడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండలో షాట్ వీడియో చేస్తూ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కాజీపేట నుంచి బలార్ష మార్గంలో ట్రైన్ వస్తుండగా వడ్డేపల్లి వద్ద పట్టాల పక్కన అక్షయ్ అనే యువకుడు నడుస్తూ రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి మిత్రుడు దూరంగా ఉండి వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన రైలు యువకుడిని ఢీకొట్టింది. దీంతో యువకుడు ఒక్కసారిగా ఎగిరి పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అక్షయ్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇలాంటి ఘటనే
రైలు పట్టాలపై దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అయినా కొందరి తీరు మారదు. ఓ మహిళ ఇలాగే పట్టాలు దాటి, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ క్షణం ఆలస్యమైనా వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి నుజ్జునుజ్జు అయిపోయేదే. ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "జీవితం మీదే. నిర్ణయమూ మీదే" అనే క్యాప్షన్‌ని కోట్ చేశారు. ఆ మహిళతో పాటు ఇంకొందరు అంతే నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ కనిపించారు. నిజానికి ట్రైన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగలేదు. మరో ట్రైన్ క్రాస్ అవ్వటానికి స్టేషన్ రాక ముందే ఓ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. ప్లాట్‌ఫామ్ వరకూ వెళ్లటం ఎందుకు అనుకున్నారో ఏమో. కొంత మంది మధ్యలోనే ట్రైన్‌లో నుంచి దిగారు. తమ సామాన్లు తీసుకుని పట్టాలు హడావుడిగా పట్టాలు దాటారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు.
ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj
— Awanish Sharan (@AwanishSharan) July 19, 2022
Also Read : TS Crime : ఆదర్శ దంపతుల దొంగాట, చివరికి కటకటాల పాలు!
Also Read : Pea Seeds Ganesh 2022: బఠానీ విత్తనాలతో వినాయకుడు, ఓసారి లుక్కేయండి!