అన్వేషించండి

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్‌కు అధికారులు - బిల్లు నేడే ప్రవేశపెడతారా? అసెంబ్లీ పొడిగింపా?

ఈ ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. నేడే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తేనే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలు పడుతుంది.

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలు కల్పించే ఆర్టీసీ బిల్లుపై వివరణ కోసం నేడు (ఆగస్టు 6) ఆర్టీసీ, ఆర్ అండ్ బీ అధికారులు తెలంగాణ రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ రాజ్ భవన్ కు పిలిపిస్తున్నారు. ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలను గవర్నర్ అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున కాసేపట్లో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ కానున్నారు. 

అయితే, ఈ ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. నేడే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తేనే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలు పడుతుంది. ఈ క్రమంలో దీనిపై స్పీకర్ తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే బిల్లును స్పీకర్ అనుమతితో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ముందు గవర్నర్ వద్దకు ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది.

అసెంబ్లీ సమావేశాల పొడిగింపు ఉంటుందా?

ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్న నమ్మకంతో మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ ఇంకా గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వివాదం ఏర్పడింది. గతంలో అసెంబ్లీలో పాసయిన చాలా బిల్లులను ఇలా పెండింగ్ లో పెట్టి కొన్ని వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నేడు గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను పొడిగించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. 

మరోవైపు, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిల్లుపై కొన్ని సందేహాలున్నాయని.. ప్రభుత్వానికి రాజ్ భవన్ లేఖ పంపింది. ఈ లేఖకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సమాధానాలతో కూడిన లేఖను  రాజ్ భవన్ కార్యదర్శికి కూడా ప్రభుత్వం పంపింది. తాజాగా ఆర్ అండ్ బీ అధికారులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో ఈ అంశంపై వివరణ ఇవ్వనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Embed widget