Governer Tamilsai : తెలంగాణ సర్కారే గవర్నర్ వ్యవస్థను అవమానిస్తోంది - ఖమ్మం సభలో విమర్శలకు తమిళిసై కౌంటర్ !
తెలంగాణ ప్రభుత్వమే గవర్నర్ వ్యవస్థను అవమానిస్తోందని గవర్నర్ తమిళిసై అరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
Governer Tamilsai : బిఅరెస్ ఖమ్మం సభలో గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రుల కామెంట్స్ పై తెలంగాణ గవర్నర్ తమిళ్ సై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ ను అవమానించారని .. ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థలను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తరువాత రాష్ట్రప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తాను 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా- ప్రోటోకాల్ ఎలా అనేది తనకు తెలుసని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదని తమిళిసై వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయి ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో మీరు చూస్తారుగా అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం సభలో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని సీఎంల విమర్శలు
ఖమ్మంలో జరిగినే బీఆర్ఎస్ సభలో గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ కేజ్రీవాల్ విమర్శించారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని.. వారంతా కేంద్రానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే పనిగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నార. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారి.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విమర్శలపైనా తమిళిసై స్పందించారు.
బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదం
అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలోని రోజువారీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడంపై అక్కడ అధికారంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం వల్ల అఖిల భారత సివిల్ సర్వీస్ అధికారులు కూడా తమతమ శాఖల మంత్రుల మాటలను ఖాతరు చేయని పరిస్థితి ఏర్పడిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈ నెల 9న తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. శాసనసభ నుంచి వాకౌట్ చేసి గవర్నర్ వెళ్ళిపోవడం కూడా ప్రజాస్వామిక సంప్రదాయాల ఉల్లంఘన కిందకే వస్తుందనేది విజ్ఞుల భావన. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ర్ట ప్రభుత్వ విచక్షణాధికారాన్ని గవర్నర్ తన చర్యలతో ఒక సవాలు చేసినట్టయింది.- ఇదే పరిస్థితి కేరళ, బెంగాల్ లలో కూడా ఉంది.
కేసీఆర్ తన పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని తమిళిశై ఆరోపణ
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థ ద్వారా బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో ఒక ప్రమాదకరమైన క్రీడను చేపట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ఆదేశాలను, సంప్రదాయాలను కాలరాస్తోందని ్ంటున్నారు. రాష్ట్రాల్లో అభివృద్ధిని స్తంభింప చేస్తూ, ఆయా ప్రభుత్వాలను అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమిళిసై స్పందన ఆసక్తికరంగా మారింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు - రైతుల ఆందోళనలతో దిగి వచ్చిన ప్రభుత్వం !