Gadwal MLA : రివర్స్‌లో బీఆర్ఎస్ వైపు గద్వాల్ ఎమ్మెల్యే - కాంగ్రెస్‌పై అప్పుడే విరక్తి పుట్టిందా ?
Telangana : బీఆర్ఎస్‌లోనే కొనసాగాలని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి
Gadwal MLA Krishna Mohan Reddy : కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ భారత రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన కేటీఆర్ ను కలిశారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు.
గద్వాల్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి
వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వైపు చూశారు. రేవంత్ రెడ్డితో సమావేశమై.. నియోజకవర్గ అభివృద్ధి కోసం హామీలు తీసుకున్న తర్వతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయనకు వర్గ పోరు అధికమయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సరితా తిరుపతయ్య వర్గం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్‌లోనే కీలక నేతగా ఉన్న సరితా తిరుపతయ్యా.. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో విబేధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గొంతు చించుకుని మాట్లాడితే, అబద్ధాలు నిజాలవుతాయా?- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
కృష్ణమోహన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరినా ప్రాధాన్యత తగ్గబోదని సరితా తిరుపతయ్యను రేవంత్ రెడ్డి బుజ్జగించి పార్టీలో చేరికలను కొనసాగించారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే.. అటు తన క్యాడర్ కు ఇటు కాంగ్రెస్ క్యాడర్ కూ కాకుండా పోయినట్లు అవుతుందన్నట్లుగా కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి ఉండటంతో ఆయన ఆలోచించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు డబ్బులకు ఆశపడి చేరుతున్నట్లుగా కొంత మంది ప్రచారం చేస్తున్నారు. దీంతో వారు మరింత అసంతృృప్తికి గురవుతున్నారు.
తెలంగాణలో కొత్త బస్సు సర్వీసులు- రద్దీ తట్టుకునేందుకు ప్రభుత్వ నిర్ణయం
మిగతా ఎమ్మెల్యేలూ ఉక్కపోతకు గురవుతున్నారా ?
పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన ప్రాధాన్యం.. చేరిన తర్వాత ఇవ్వడం లేదని ఫీలవుతున్నారు. పార్టీ మారి తప్పు చేశామా అన్న పరిస్థితికి రావడంతో వీలైనంత ఎక్కువగా వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేలా రాజకీయ వ్యూహం ఖరారు చేసిన రేవంత్ రెడ్డికి దానిని అమలు చేయడంలో మాత్రం.. ఇబ్బందులు పడుతున్నారు. చేరిన వారు కూడా వెనక్కి పోతూండటం ఆసక్తికరంగా మారింది.