అన్వేషించండి

Harish Rao: గొంతు చించుకుని మాట్లాడితే, అబద్ధాలు నిజాలవుతాయా?- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

Harish Rao Slams CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్య దూరమైన అంశాలతో సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Harish Rao in Telangana Assembly: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ తప్పుడు, సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి సమావేశంలో ఇదే జరుగుతోందన్నారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళ్లేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరేలాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పు దోవ పట్టించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా పంపింగ్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. నిన్నటి సమావేశంలో కూడా  విద్యుత్ మీటర్లపై తప్పుడు పత్రంతో సభను తప్పుదోవ పట్టించారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా వ్యవహరించొచ్చా? సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాము. మేము ఒప్పందం చేసుకుంటే మీటర్లు ఎక్కడైనా పెట్టామా?.. నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింప జేశారని’ రేవంత్ పై హరీష్ రావు మండిపడ్డారు

పదవులు వదులుకున్నాం
ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు పులిచింతల ప్రాజెక్టు కట్టించారు. 5 జులై 2005 నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం మంత్రి పదవులు వదులుకున్నాం. 17 జులైన రాజీనామాలు ఆమోదించారు. 19.12.2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చారు. ప్రతి సెషన్ లో సీఎం ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. పదవుల కోసం పెదవులు ఎవరు మూసుకున్నారో ప్రజలకు తెలుసు. పోతిరెడ్డి పాడు పై వైఎస్ హాయాంలో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మా పై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డి పాడు పై జీఓ రాకముందే మేము వై ఎస్ కేబినెట్ నుంచి వైదొలిగాం. మేం రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణమన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 
 
అంతా నవ్వుతున్నారు
తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు.  తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశామన్నారు. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదంటూ విమర్శించారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జారిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందన్నారు. కేసీఆర్ లాగా రాజీనామా లు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా ?. కేసీఆర్ దీక్ష తోనే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. 14 యేండ్ల తెలంగాణ ఉద్యమం లో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబు తోనే ఉండేవారని ఎద్దేవా చేశారు. రేవంత్ తెలంగాణ ఉద్యమ కారుల పై దాడికి రైఫిల్ తో బయలు దేరారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని హరీష్ అన్నారు. 

ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తమన్నారు
ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఉచితంగా చేస్తామని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. మంత్రివర్గంలో మాత్రం క్రమబద్దీకరణకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో కేసు ఉపసంహరించుకుంటామని అంటున్నారు. నేను ఉద్యమకారుడిని అని చెప్పుకునే యత్నం సీఎం రేవంత్ చేస్తున్నారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయలేదు. సోనియాని బలి దేవత అనలేదా? ఉద్యమకారులపై తుపాకీ పెట్టలేదా? అప్పుడు నిన్ను రైఫైల్ రెడ్డి అనలేదా? ఒక్కరోజు తెలంగాణ కోసం మాట్లాడలేదు. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత రేవంత్ మాట్లాడారు. అసెంబ్లీ లో గొంతు పెంచుకుంటే అబద్ధాలు నిజాలు అవుతాయా? 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడింది. రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారు. మీ పని అయిపోయిందా? 28 పార్టీల పొత్తుతో 99 సీట్లు మీకు వచ్చాయి. 1984 తర్వాత కాంగ్రెస్.. సొంతంగా అధికారంలోకి రాలేదు” అని చిట్ చాట్ లో హరీశ్ రావు అన్నారు.

సోనియాను బలిదేవత అనలేదా ?
ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. క్యాబినెట్ లో మాత్రం క్రమబద్ధీకరణకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటామని చెబుతున్నారు. నేను ఉద్యమకారుడినని చెప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయలేదు. సోనియాను బలి దేవత అనలేదా ? కార్యకర్తలపై తుపాకీ పెట్టలేదా? అప్పుడు మీమ్మల్ని  రైఫిల్ రెడ్డి అని పిలవలేదా? తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అసెంబ్లీలో గొంతు చించుకుంటే అబద్ధాలు నిజమవుతాయా? 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోయింది. వారు మా చేతిలో రెండుసార్లు ఓడిపోయారు. మీ పని అయిందా? 28 పార్టీల కూటమితో మీకు 99 సీట్లు వచ్చాయి. 1984 తర్వాత కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాలేదు’’ అని హరీశ్ రావు చిట్ చాట్ లో పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget