Telangana : మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి - కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి హితవు
Sabita : మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు వారి ఇంట్లో వారు బాధపడరా అని ప్రశ్నించారు.
KTR Vs Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ బీఆర్ఎస్ కార్యకర్త పెట్టిన పోస్టు చిచ్చు పెట్టేసింది. ఈ పోస్టుపై కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. అయితే తమను గతంలో కొండా సురేఖ బూతులు తిట్టలేదా అని కేటీఆర్ ప్రశ్నించడం.. ఆమెవి దొంగ ఏడుపులని విమర్శించడంతో కొండా సురేఖ రివర్స్ లో తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ వివాదంపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత సబితా ఇంద్రరెడ్డి స్పందించారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా అని ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరమన్నారు.
డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కొండా సురేఖ
కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని వారికి డ్రగ్స్ అలవాటు చేశారని కొండా సురేఖ ఆరోపించారు. సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆరేనని వారి ఫోన్లను ట్యాప్ చేశారని కూడా మండిపడ్డారు. కొంత మంది హీరోయిన్లను వేధించడంతో వారు త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని కేటీఆర్ సమర్థించడంతో పాటు తాను దొంగ ఏడుపులు ఏడ్చానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
కొండా సురేఖవి దొంగ ఏడుపులు, పెడబొబ్బలన్న కేటీఆర్
తనపై బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన పోస్టులను చూపించి కొండా సురేఖ కంట తడి పెట్టడాన్ని కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఎద్దేవా చేశారు. కొండా సురేఖవి దొంగ ఏడుపులు, పెడబొబ్బలన్నారు. గతంలో తమపై ఇలాంటి ట్రోలింగ్ చేసినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ అన్న వ్యాఖ్యలు రికార్డెడ్ కాదు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు అన్న మాటలు. కానీ కొండా సురేఖ నేరుగా మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?
సోషల్ మీడియా పోస్టులతో రాజకీయ ఉద్రిక్తతలు
రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా సైన్యాలతో అనేక సమస్యలు వస్తున్నాయి. వ్యక్తిత్వ హననం చేసేందుకు ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా పెద్ద ఎత్తున దారుణమైన పోస్టులు పెడుతూండటంతో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. కొండా సురేఖపై పెట్టిన పోస్టుకు.. హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు.కానీ కేటీఆర్.. లతమపై గతంలో పెట్టారని తప్పేం కాదన్నట్లుగా స్పందించడంతో వివాదం ముదిరింది.