అన్వేషించండి

Revanth Reddy : హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?

Telangana : రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వివాదాలతో పాటు సీనియర్ల ఫిర్యాదులతో మంత్రి పదవుల్ని రేవంత్ వ్యతిరేకులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

Revanth Reddy reputation : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైకమాండ్ హఠాత్తుగా ఢిల్లీకి పిలిపించుకుంది. ఓ వైపు కూల్చివేతల విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో హైకమాండ్ పిలవడంతో అందరూ ఏదో ఉందని అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు పిలిపించిందన్న దానిపై స్పష్టత లేదు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగింటిని భర్తీ చేయాలని రేవంత్ చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు.తన చాయిస్ గా పేర్లు కూడా ప్రకటించారు. కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పీసీసీ చీఫ్ ను మాత్రం నియమించారు. 

కూల్చివేతలపై జోరు తగ్గించాలని చెప్పేందుకు పిలిపించారా ?

రేవంత్ రెడ్డి  హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత కూల్చివేతల అంశంపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఒక్క ప్రైవేటు ఆస్తిని కూల్చకపోయినా..ప్రభుత్వ, చెరువుల భూముల్లో ఉన్న వాటినే కూలుస్తున్నా వ్యతిరేకత కనిపిస్తోంది. మొదట ఫామ్ హౌస్‌లు.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు అందరూ అభినందించారు. కానీకబ్జాలు చేసిన కట్టి సామాన్యులకు అమ్మేసిన ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఆ కూల్చివేసిన ఇళ్లకు ప్రభుత్వ సంస్థలే అనుమతులు, రిజిస్ట్రేషన్లు చేయడమే దీనికి కారణం. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి.. ప్రభుత్వమే కూల్చివేస్తే ఎట్లా అన్న విమర్శలు వచ్చాయి. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కూల్చివేతలపై జోరు తగ్గించాలని సలహా ఇచ్చేందుకు హైకమాండ్ పిలిపించిందని అంటున్నారు. 

హైడ్రా మిస్ ఫైర్ అవుతుందా? ఈ వ్యవస్థతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభమా! నష్టమా!

రేవంత్ దూకుడు పార్టీకి నష్టం చేస్తుందని సీనియర్ల ఫిర్యాదులు

రేవంత్ రెడ్డి దూకుడు పార్టీకి నష్టం చేస్తుందని సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు. సీఎం పదవి  ఇచ్చినా సీనియర్లకూ ప్రాధాన్యం ఇస్తున్నారు.  చాలా అంశాల్లో నాన్చి నాన్చి నిర్ణయాలు చెబుతున్నారు. పదే పదే ఢిల్లీకి పిలిపిస్తున్నారు. ఈ పరిణామాలతో పాటు మంత్రి పదవుల భర్తీ విషయంలో రేవంత్ మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కీలక శాఖలకు  మంత్రులు లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని విస్తరణకు అనుమతి ఇవ్వాలని అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి కూడా అసంతృృప్తికి గురవుతున్నారని చెబుతున్నారు. 

Also Read: KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్

ఇక రేవంత్ దూకడు తగ్గుతుందా ?

ప్రస్తుత పరిణామాలతో రేవంత్ దూకుడు ఇక తగ్గుతుందా అన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ప్రారంభమయింది. కానీ  రేవంత్ వర్గీయులు మాత్రం.. సోషల్ మీడియాలో చేసే ప్రచారానికి.. ఢిల్లీలో జరిగే దానికి చాలా తేడా ఉంటుందని అంటున్నారు. ముందు ముందు హైకమాండ్ ..  రేవంత్ కు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తారని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ పర్యటన తర్వాత రేవంత్ తీసుకోబోయే నిర్ణయాల్లో ఉండే మార్పును బట్టి హైకమాండ్ నుంచి ఆయనకు ఎలాంటి సందేశం వచ్చిందన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget