KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
Telangana Bhavan News | తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే నాలాలపై ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసుతో పాటు హైడ్రా కమిషనర్ ఆఫీసును కూల్చివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
![KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్ KTR challenges Telangana Govt to Demolish GHMC office and Hydra commissioner office KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/d8fa8fa7f578c3108e850649620143c91727692548807233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KTR Pressmeet At Telangana Bhavan | హైదరాబాద్: నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చాల్సి వస్తే, మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న బుద్ధ భవన్ లో హైడ్రా ఉన్న ఆఫీసును నాలా మీద కట్టారని, అలాంటప్పుడు కూల్చివేతలు ఇక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని సూచించారు. అదే బిల్డింగ్ లో ఎలక్షన్ కమిషనర్, మహిళా కమిషన్ ఉందన్నారు. పర్మిషన్లు ఇచ్చే జీహెచ్ఎంసీ బిల్డింగ్ సైతం నాలా మీద ఉందని, దమ్ముంటే GHMC భవనాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు.
సెక్రటేరియట్ కూడా కూల్చేస్తారా?
కేసీఆర్ మార్క్, ఆయన ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని అనుకుంటున్నారు. వినాయక నిమజ్జనం సందర్బంగా సెక్రటేరియట్ వద్దకు రాగానే కేసీఆర్ పాటలు పెట్టడం, నినాదాలు చేయడంతో రేవంత్ రెడ్డికి ఇరిటేషన్ వచ్చింది. అందుకే కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ను సైతం కూల్చివేస్తారేమో. ఓట్లు అడిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రజలతో కలిసిపోయినట్లు మభ్యపెట్టారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతల బాధితుల సమస్యలు కనిపిస్తలేవా, బాధితుల ఆక్రందనలు వినిపిస్తలేవా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై ఎన్నో విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై పెట్టుబడితో ఏం ప్రయోజనం ఉందని అడిగేవారు. ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు అని గర్వంగా చెబుతున్నాం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. హైదరాబాద్ తో పాటు వేలాది పట్టణాలు, గ్రామాలకు మంచినీళ్లు అందించే ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ మీద పెట్టిన నీటి కుండలాంటిది. దాని ద్వారా తెలంగాణ వరి సాగులో నెంబర్ వన్ గా నిలిచింది. మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకైనా సాగునీరు వస్తుందా, కొత్త ఆయకట్టుద్వారా ఒక్క రైతుకైనా ప్రయోజనం కలుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
రూ.1.5 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
బీఆర్ఎస్‌కు, కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాంటిదని విమర్శించారు. లక్ష కోట్ల ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలు కలిగాయి. మరి మూసీ ప్రాజెక్టుతో రూ.1.5 లక్షల కోట్లతో ఏం ప్రయోజనం ఉంది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ 38.5 కిలోమీటర్లకు రూ. 7 వేల కోట్లు ఖర్చయింది. కొంతమేర పనులు మిగిలున్నాయి. యమునా నది ప్రాజెక్టు 22 కిలోమీటర్లు కాగా, ఖర్చు రూ.1000 కోట్లు. కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కేంద్రం చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటిది మూసీ నది సుందరీకరణతో ఎవరికి ప్రయోజనం, పైసలు లేవని చెబుతూనే మీ స్వార్థం కోసం కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధమయ్యారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
రుణమాఫీ నెరవేరలేదని రైతులు సెల్ఫీ ఉదయం చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి, పేదల ఇండ్లు కూల్చడం కొనసాగిస్తున్నారు. ప్రజల ఆగ్రహంతో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు ముఖం చాటేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: Attak On Telangana Bhavan : తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి - టెన్షన్ టెన్షన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)