Attak On Telangana Bhavan : తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి - టెన్షన్ టెన్షన్
Telangana Bhavan: కాంగ్రెస్ కార్యకర్తలు హఠాత్తుగా తెలంగాణ భవన్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎదురుదాడి చేయడంతో జూబ్లిహిల్స్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Congress workers attacked Hyderabad Telangana Bhavan : హైడ్రా కూల్చివేతల కారణంగా జరుగుతున్న రాజకీయంలో నేతల మధ్య రాజకీయ వాగ్వాదాలు శృతి మించి పోతున్నాయి. ఫలితంగా దాడులకు సైతం దిగితున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న తెలంగాణ భవన్ పైకి కాంగ్రెస్ కార్యకర్తలు దండెత్తినట్లుగా వచ్చారు. ఒక్క సారిగా వందల మంది రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. విషయం తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడంతో.. తెలంగాణ భవన్ ఎదురట రణరంగం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన వారు మంత్రి కొండు సురేఖపై నీచంగా కామెంట్లు పెట్టారని.. పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ వరంగల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ముట్టడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.
రూల్స్ తెలుసా రంగనాథ్. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు సరైన సంఖ్యలో లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలే వారితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఆందోళనల్లో మహిళా నేతలు,కార్యకర్తలు ఉండటంతో పరిస్తితి ఎటు వైపు వెళ్తుందోనని కంగారు పడ్డారు. ఈ వివాదం కారణంగా అత్యంత బిజీగా ఉండే జూబ్లిహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు కాసేపటికి అందర్నీ పంపించివేశారు. ఓ వైపు హైడ్రా విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇలా తెలంగాణ భవన్‌పైకి కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉసిగొల్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, టీ న్యూస్ చానల్ కార్యాలయం కూడా ఉంది. చానల్ ఆ భవనం నుంచి ప్రసారమవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ లోపలికి వరకూ వెళ్లి ఉంటే పెద్ద సమస్య అయ్యేదని అంచనా వేస్తున్నారు. కాసేపటికి పరిస్ధితి సద్దుమణిగింది. ఇరవైపులా దాడుల వరకూ వెళ్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
తెలంగాణ భవన్ మీదకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాదామని రేవంత్ రెడ్డికీ అదే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ హెచ్చరించింది.
తెలంగాణ భవన్ మీదికి దాడికి వచ్చిన.. కాంగ్రెస్ కార్యకర్తలను ఉరికించి కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
— BRS News (@BRSParty_News) September 30, 2024
రేవంత్ రెడ్డి వీపు చింతపండు అవ్వడం అంటే ఇది 👇 pic.twitter.com/yuOzWtUn5v