అన్వేషించండి

HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం

Hyderabad: న్యాయస్థాన ఆదేశాలు పట్టించుకోకుండా భవనాలు ఎలా కూలుస్తారని హైడ్రా అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రూల్స్ తెలుసా అంటూ నిలదీసింది.

Telangana High Court: హైడ్రా అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగూ దూకుడుగా వెళ్తున్న హైడ్రాపై కొందరు బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిష్ విచారించిన హైకోర్టు అమీన్‌పూర్ తహశిల్దార్‌, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరు వీళ్లిద్దరు కోర్టు విచారణకు హజరయ్యారు. 

కోర్టుకు ఆహజరైన రంగనాథ్‌, అమీన్పూర్ తహశీల్దార్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదివారం కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల గురించి మీకు తెలుసా తెలియదా అని ప్రశ్నించింది. అసలు రూల్స్ గురించి తెలుసా అని నిలదీసింది. హైడ్రా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో ఆసుపత్రి భవనం కూల్చివేత విషయంలో హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి కూడా అధికారులు దూకుడుగా వ్యవహరించారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 21 సాయంత్రం నోటీసులు ఇచ్చిన అధికారులు 22వ తేదీ ఉదయాన్నే కూల్చివేతలు మొదలు పెట్టారని వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అమీన్‌పూర్ తహశీల్దార్, హైడ్రా కమిషనర్‌ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వీళ్లిద్దరూ ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు. 

రంగనాథ్‌ అత్యుత్సాహం వద్దు-  హైడ్రా చీఫ్‌కు హైకోర్టు హెచ్చరిక
రాజకీయ నేతలను, పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, శని ఆది వారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని నిలదీసింది. కరుడుగట్టిన నేరస్థుడిని ఉరితీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని గుర్తుచేసింది. అలాంటిది ఇంటిని కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించింది. 

శని, ఆదివారాల్లోనే ఎందుకు?
ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఆదివారం సెలవుదినం.. అలాంటిది సెలవు దినాలలో మీరు ఎందుకు పనిచేస్తున్నారని రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో అదికూడా సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని నిలదీసింది. గతంలో వారాంతంలో కూల్చివేతలు చేపట్టవద్దంటూ కోర్టులు తీర్పిచ్చిన విషయం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

చట్టప్రకారం నడుచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను హెచ్చరించింది. రాజకీయ నేతలు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో అత్యుత్సాహంతో పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడతారంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. 

అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబివ్వండి..

ఆదివారం కూల్చివేతలు చేపట్ట వచ్చా అని హైకోర్టు ప్రశ్నించగా.. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బంది కావాలని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ జవాబు చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన ప్రశ్నకు నేరుగా జవాబివ్వాలని హెచ్చరించింది. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని అడిగింది. ఆక్రమణదారులు ఇల్లు ఖాళీ చేయనంతమాత్రాన కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అంటూ మండిపడింది. చట్ట ప్రకారం నడుచుకోకుంటే ఇంటికి వెళ్తారు జాగ్రత్త.. అంటూ అధికారులను హెచ్చరించింది.

కూల్చివేతలపై మాత్రమే దృష్టి పెట్టారేం?
హైడ్రాకు ఉన్న విధుల్లో ఆక్రమణల తొలగింపు కూడా ఒకటని, కేవలం ఇదొక్కటే హైడ్రా డ్యూటీ కాదని హైకోర్టు పేర్కొంది. జీవో ప్రకారం నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా హైడ్రాకు ఉందని, మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించింది. అమీన్ పూర్ కూల్చివేతలతోపాటు మూసీ విషయంలోనూ 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఇది అరుదైన కేసుగా భావించి అధికారులను విచారణకు పిలిచినట్లు తెలిపింది. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే

ఇవ్వాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
చట్టప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, స్థానిక సంస్థల అనుమతి తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తుచేసింది. అయితే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. కానీ దాని పని తీరుపైనే తమ అభ్యంతరమని కోర్టు పేర్కొంది. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదని, ఎఫ్ టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలను ఎలా తేలుస్తారని నిలదీసింది. అనంతరం కేసు విచారణను ఈ అక్టోబర్ 15 కు వాయిదా వేస్తూ అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget