Tiger Dies: భీకర పోరులో ఓ ఆడపులి మృతి, కారణాలు వెల్లడించిన సీసీఎఫ్ శాంతా రామ్
Komaram Bheem AsifaBad district: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మృతి కలకలం రేపుతోంది. దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ ఆడపులి మృతి (Tiger Dies) చెందినట్లు గుర్తించారు.
A Tiger Dies while Clash with other Tiger: ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ (Komaram Bheem AsifaBad) జిల్లాలో పెద్దపులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ ఆడపులి మృతి (Tiger Dies) చెందినట్లు గుర్తించారు. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్ లో గత రెండు నెలల కిందట పులులు పలు ఆవులపై దాడి చేసి చంపేశాయి. ఆపై ఏలాంటి చప్పుడు లేకుండా పోయింది. అయితే తాజాగా ఆదివారం ఓ పులి దరిగాం అటవి ప్రాంతంలో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థుల సమాచారంతో.. సంఘటనా స్థలాన్ని సీసీఎఫ్ శాంతా రామ్ అటవీశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. చనిపోయయింది ఆడ పులి అని, తల, మెడ ప్రాంతంలో తీవ్రగాయాలు కాగా.. ఒక కాలు విరిగినట్లు వెల్లడించారు.
ఆవాసం కోసం జరిగిన ఘర్షణలో ఆడపులి మృతి
దరిగాం అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకోవడం కోసం రెండు పులుల మధ్య ఘర్షణ జరిగిందని, దాని ఫలితంగా ఓ ఆడపులి తీవ్ర గాయాలపాలై చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పులి మృతి పట్ల కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయంలో ఆదివారం ఫారెస్ట్ అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీసీఎఫ్ శాంతా రామ్ మాట్లాడుతూ.. ఆవాసం కోసం రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలోనే పెద్ద పులి మృతి చెందినట్లు సీసీఎఫ్ తెలిపారు. దాదాపు ఐదు రోజుల కిందట ఈ ఘటన జరిగి ఉండవచ్చని అన్నారు.
విష ప్రయోగం జరగలేదు..
పెద్దపులి చనిపోయిందని తెలియగానే అక్కడికి వెళ్లి అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆపై ఆడపులికి పోస్ట్ మార్గం నిర్వహించిన తరువాత, శాంపిల్స్ ను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపినట్లు సీసీఎఫ్ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ పలు విషయాలు వెల్లడించారు. రెండు సంవత్సరాల వయసు గల ఆడపులుల మధ్య ఆవాసం కోసం జరిగిన ఘర్షణలో ఓ ఆడపులి చనిపోయింనది తెలిపారు. అయితే విష ప్రయోగం ఏమీ జరుగలేదని, పులి మెడ, తలపై బలమైన గాయాలు చూస్తే రెండు పులుల మధ్య ఘర్షణతోనే అది చనిపోయి ఉండవచ్చని సీసీఎఫ్ శాంతా రామ్ క్లారిటీ ఇచ్చారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత ఎన్‌టీసీఏ నిబంధనల ప్రకారం చనిపోయిన ఆడపులిని ఖననం చేసినట్లు తెలిపారు.