అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Minister Jagadish Reddy: భారత్ లో మెుట్ట మెుదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్.. హైదరాబాద్ లోనే

రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

హైదరాబాద్.. రాయదుర్గంలోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 

హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామమని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా ఏర్పాటు చేశామన్నారు. రింగ్ రోడ్ చుట్టూ 400 కేవీ సబ్ స్టేషన్ లు, 220 కేవీ, 133 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ నాలుగు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం కానీ 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశామని చెప్పారు.  

ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా మనమే వాడుతున్నమని.., టీఎస్ ట్రాన్స్ కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పనులు చాలా వేగంగా జరిగాయని.., కొవిడ్ తోపాటు అనేక ఆటంకాలు తట్టుకొని పూర్తి చేశామని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సబ్ స్టేషన్ తో నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను 1400 కోట్లతో నిర్మాణం చేశామని.. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారని వివరించారు. 

Also Read: Chain Snatching: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్... ఒక్కడే ఐదు చోట్ల స్నాచింగ్... !

Also Read: Revant Reddy : టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే తెలంగాణకు నష్టం .. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతామన్న రేవంత్ రెడ్డి !

Also Read: Warangal: చిట్ ఫండ్ నిర్వాహకుల చీటింగ్... రాజకీయనాయకుల అండదండతో దందాలు... రంగంలోకి వరంగల్ పోలీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget