Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Jagitial News: జగిత్యాల జిల్లాలోని ఓ కుటుంబం పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించింది. బంధువుల సమక్షంలో వేడుక చేసి విందు భోజనం వడ్డించారు.
![Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ.. barasala function for dogs in jagitial district Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/24/a0fdfe265f605945a459452afa7588cf1732447615542876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Barasala Function For Dogs In Jagitial District: కొందరికి పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. ఎంతలా అంటే.. వాటిని తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. కుటుంబంలో వాటికి అంతే ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించింది. బంధువులు, చుట్టుపక్కల వారిని పిలిచి వింధు భోజనం పెట్టి వేడుక చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. జగిత్యాల జిల్లా (Jagitial District) మెట్టుపల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు ఏడాదిగా షీజూ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. దీనికి డైసీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇటీవలే ఆ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
తమ కుటుంబంలో ఒక్కటిగా పెరిగిన కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల చేయాలని ఆ దంపతులు భావించారు. అనుకున్నట్లుగానే సంప్రదాయం ప్రకారం కుక్క పిల్లలకు బారసాల వేడుక నిర్వహించారు. బంధువులు, ఇరుగుపొరుగు వారిని పిలిచి నామకరణ మహోత్సవం చేశారు. అంతేకాకుండా పిండి వంటలతో విందు భోజనం వడ్డించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కుక్కకు బారసాల నిర్వహించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: Nirmal Tiger News: నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి కలకలం, కవ్వాల్ అభయారణ్యం నుంచి వచ్చినట్లు అనుమానం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)