అన్వేషించండి

Ex DSP Nalini: ఉద్యోగం వద్దు ధర్మ ప్రచారానికి సాయం చేయండి-సీఎం రేవంత్‌కు నళిని లేఖ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు. ఉద్యోగం చేసే పరిస్థితిలో లేనని... తనకు న్యాయం చేయాలనుకుంటే ధర్మప్రచారానికి సాయం చేయాలని కోరారు.

Ex DSP Nalini Request to CM: మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవికి రాజీనామా  చేసిన నళికిని మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని పోలీస్‌శాఖను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. పోలీస్‌శాఖలో పోస్టింగ్‌ ఇచ్చేందుకు నిబంధనలు అడ్డువస్తే... మరో శాఖలో అదే స్థాయిలో  ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. దీనిపై స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్వేగభరితమైన లేఖ రాశారు నళిని. తనపై సీఎం చూపించిన అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  ఎం ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని, తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రాశారు. అయితే ప్రస్తుతం తనకు ఉద్యోగం అవసరం లేదని... తనకు  సాయం చేయాల్సి వస్తే... ధర్మప్రచారం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఆ నగదుతో ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పారామె. 

సీఎంకు నళిని రాసిని లేఖ

గౌరవనీయులైన సీఎం గారు..... మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది.  అంతేకాదు గతం ఒక రీల్‌లా మళ్లీ నా కళ్ళ ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా నిందను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూడేళ్లు చాలా  ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా  చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా  ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే... నేను రాజీనామాను విత్‌డ్రా చేసుకుని డిపార్ట్‌మంఎట్‌లో చేరాను. కానీ, నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18  నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో పోస్టింగ్ ఇచ్చి..  నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్స్‌లో అడ్వర్స్‌ (చెడు) రిమార్క్ రాయమన్నారు. బ్యాచ్‌లో నా ఒక్క దానికే ప్రమోషన్‌ను ఆపేయడం,  ప్రొబేషన్ పీరియడ్ పెంచడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి  గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం  చేయకపోగా.. నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ గారికి, సోనియా గాంధీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో  నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే నవంబర్‌ 1, 2011న డీజీపీ పదవికి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీకృష్ణ కమిటీ పేరుతో జరుగుతున్న  జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. ఆనాడే నాకు  డిపార్ట్‌మెంట్‌ పట్ల ఏహ్య భావం కలిగింది. ఆరోజు సుష్మాస్వరాజ్ నల్గొండ సభకు రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది.  నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్‌ను ఆ రోజే హత్య చేశారు.

అది జరిగి 12ఏళ్లు పూర్తయ్యిన తర్వాత తెలంగాణ మూలాలు గల సీఎంగా మీరు (రేవంత్‌రెడ్డి) నా (నళిని) కేస్‌ను తిరిగి తవ్వారు. మరణ కారణం తెలుసుకోవాలి  అనుకుంటున్నారు. చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ  ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద  తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ  నన్ను వెలివేశారు. ఒంటరితనం అనే శిక్షను పదేళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని..  జీవచ్ఛవంలా బతికాను.

రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా  జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. ఇక చాలు. ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి  త్యాగమూ చేయలేను. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా  ముందున్న కర్తవ్యం. దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు.. సమాజ ఉన్నతికి కూడా పాటు పడవచ్చు. కాబట్టి నా పంథా మర్చుకొలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్  కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను.  అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను న్యాయ దర్శనం నుంచి తత్త్వ శాస్త్రం  వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం చాలా సంఘర్షణ మయం, వేదనా  భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి నేను సీఎంగా ఉన్న మిమ్మళ్లి  కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్‌మెంట్‌లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి  స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. ఇక నాకు మీరు న్యాయం  చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని.  మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. ఇట్లు.. ఒక సనాతని నళినీ  ఆచార్యా.

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget